ఆత్మహత్యలు చేసుకుంటున్న సైన్యం

69 Suicides In Indian Army In 2015

05:07 PM ON 12th December, 2015 By Mirchi Vilas

69  Suicides In Indian Army  In 2015

2015 వ సంవత్సరంలో భారత సైన్యంలో 69 మంది ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

సైనికుల ఆత్మహత్యల గురించి పార్లమెంటులోని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ మాట్లాడుతూ, 2015 వ సంవత్సరంలో ఇప్పటివరకు సైన్యంలో 69 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారని సమాధానమిచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలు, ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్ళు వంటి అనేక కారణాలున్నాయని తెలిపారు.

2012 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 334 మంది సైనికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాటిలో నౌకాదళంతో 12 మంది, ఎయిర్‌ఫోర్స్‌ లో 67 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని వెల్లడించారు. సైనిక అధికారులు, సైనికులు ధైర్యం కోల్పోకుండా తగిన కౌన్సిలింగ్‌ తో పాటు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. యుద్ద రంగంలో ధైర్య, సాహసాలతో పోరాడే సైనికులు ధైర్యం కోల్పోయి వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు.

ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానకారణం వేరే ప్రత్యామ్నాయ వృత్తి లేకపోవడం మంత్రి అని అన్నారు.

English summary

Central Minister of Defence had said that Iin the year 2015 upto now there were 69 suicides in indian army.