చదివేది 6వ క్లాస్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఆపై ఇద్దరూ..

6th class lovers ran away from house

11:32 AM ON 30th July, 2016 By Mirchi Vilas

6th class lovers ran away from house

ప్రస్తుత కాలంలో లవ్ మ్యారేజ్ లు సర్వసాధారణం.. అయితే ప్రేమకు కులమత, వయసు బేధాలు ఉండవు. ఈ మాటని వాళ్ళు బాగా వొంటబట్టించుకున్నట్లున్నారు.. అది ఫాలో అయిపోయారు. ఇద్దరూ చదువుతుంది 6వ క్లాస్, ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఆ తరువాత ఏం చేశారో తెలిస్తే షాకౌతారు! ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ప్రముఖ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని భావించి.. యూనిఫాంతోనే వారిద్దరూ పారిపోయారు. అయితే రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో.. పోలీసులకు నెంబర్ ట్రేస్ చేయడం కష్టం అయింది.

అహ్మదాబాద్ దగ్గరలోని నడియాడ్ చేరుకున్న పిల్లలిద్దరూ అద్దెకు ఇళ్లకోసం ప్రయత్నం చేశారు. అయితే వారి వయసు, ఒంటిపై స్కూలు యూనిఫాం, భుజాన స్కూలు బ్యాగులు ఉండడం చూసి ఎవరూ ఇల్లు ఇవ్వలేదు. దీనితో.. స్నేహితుడి సాయం తీసుకునేందుకు సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే సైబర్ క్రైం పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేశారు. నడియాడ్ లో వారున్నారని గుర్తించి.. అక్కడి పోలీసులను సిగ్నల్ చూపించిన ప్రాంతానికి పంపి వారిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ వీరి ప్రేమ కథ తెలుసుకుని పోలీసులు, తల్లి తండ్రులు షాక్ తిని.. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అదండీ సంగతి.

English summary

6th class lovers ran away from house