నకిలీ ఖాతాలతో 6వేలకోట్ల స్కాం

6thousands illegal transactions found in bank of baroda

01:57 PM ON 24th November, 2015 By Mirchi Vilas

6thousands illegal transactions found in bank of baroda

దేశంలో కొత్త స్కాం వెలుగుచూసింది. నల్ల ధనాన్ని వెనక్కు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంటే 6వేల కోట్లకు పైగా నల్లధనాన్ని విదేశాలకు పంపిన కుంభకోణం వెలుగు చూసి యావత్‌ భారతావనిని కుదిపివేస్తుంది. విచారణ అధికారులను సైతం అత్యంత విస్మయానికి గురిచేస్తున్న ఈ స్కాం బ్యాంక్‌ బరోడా నేపథ్యంలో జరిగిందట.

రిక్షావాలాలు, ఆటోడ్రైవర్ల అకౌంట్లతో....

ఈ స్కాం మరింత లోతులోకి వెళ్ళేసరికి విచారణ అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు బయట పడుతున్నాయట. సుమారు 6వేల కోట్ల రూపాలయకు పైగా మనీ లాండరింగ్‌ జరిగిన ఈ కేసులో రిక్షావాలాలు, ఆటోడ్రైవర్‌లు వంటి బడుగు జీవుల పేరిట నకిలీ బ్యాంక్‌ అకౌంట్లు పుట్టించి ఆ అకౌంట్ల ద్వారా విదేశాలకు నల్లధనాన్ని పంపినట్లు విచారణలో వెలుగుచూసింది. నకిలీ బాంక్‌ ఖాతాదారులకు వాళ్ళ ఆధార్‌ కార్డ్‌ ఇతర ఐడి ఫ్రూఫ్స్‌ వాడుకునేందుకు గాను ప్రతీనేలా 10వేల రూపాయలు బ్యాంకు అధికారులు, ఈ స్కాంలో పాత్ర పోషిస్తున్న వ్యాపారస్తులు చెల్లించేవారట. దీన్ని బట్టి ఎంత వ్యవస్థీకృతంగా ఈ స్కాంకు పాల్పడ్డారో అర్థమౌతుంది. బ్యాంకింగ్‌ హవాలా అనే పేరుతో పిలవబడుతున్న ఈ స్కాం సంవత్సరకాలంగా డిల్లీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచి వేదికగా జరుగుతున్నట్లు విచారణలో గుర్తించారు. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరీ సంయుక్తంగా విచారణలో ఈ కేసులో మరిన్ని నిజాలు తేలనున్నాయి. ఇప్పటికే 58మంది బడుగు జీవుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి ఈ స్కాం నడిపినట్లు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాల ద్వారా 8వేలకు పైగా లావాదేవీలు జరిగాయట. ఈ నల్లధనాన్ని హంకాంగ్‌ ఇతర విదేశాలకు తరలించినట్లుగా గుర్తించారు. డ్రైఫ్రూట్స్‌, పప్పు ధాన్యాల పేరిట వ్యాపార లావాదేవీలుగా చూపెడుతూ నల్లధనాన్ని అక్రమార్కులు విదేశాలకు తరలించారు.


English summary

Investigating agencies probing a Rs 6,172-crore money laundering scandal in the Bank of Baroda (BoB) have unearthed a complex chain of fake accounts created in the name of rickshaw-pullers, vendors and drivers to allegedly channel money to foreign countries.