ఫేస్‌బుక్‌ లో 6.9కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు

7 Crore Active Facebook Users In India

10:55 AM ON 4th March, 2016 By Mirchi Vilas

7 Crore Active Facebook Users In India

సోషల్ మీడియా రంగంలో అగ్రగామిగా వున్న ఫేస్బుక్ తో అనుబంధం యువతకు రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా భారతీయులకు ఫేస్‌బుక్‌పై ఇప్పుడు కాదు.. ఎప్పుడో బంధం ఏర్పడింది. ఇక్కడి యువత ఫేస్ బుక్ ప్రేమలో పడింది. అలాగని పెద్దలు దూరంగా లేరు .. అందరూ ఫేస్బుక్ తో నేస్తం అవుతున్నారు. అందుకే భారత్‌లో ఫేస్‌బుక్‌కి నానాటికీ పెరుగుతున్న యాక్టివ్‌ యూజర్ల సంఖ్యే హెచ్చుతోంది. . తాజాగా భారత్‌లో 6.9కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు తమకు ఉన్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించడం అందుకు నిదర్శనం. ఇందులో 6.4కోట్ల మంది మొబైల్‌ ద్వారానే బ్రౌజింగ్‌ చేస్తున్నారని తెలిపింది.

అలాగే నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోందని కూడా అంటోంది. నెలకు 142 మిలియన్ల మంది తమకు యాక్టివ్‌ యూజర్లుగా ఉన్నారని పేర్కొంటూ, అందులో 133 మిలియన్ల మంది మొబైల్‌ నుంచే తమ సైట్‌ని చూస్తున్నారని అంటోంది. . అమెరికాకు బయట మూడు మిలియన్లకు పైగా బిజినెస్‌ అడ్వర్టైజ్‌మెంట్లు తమ సైట్లో ఉంటున్నాయని వివరించింది. ప్రచార రంగంలో ఫేస్‌బుక్‌ ఏడాదిలో 50 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించింది. భవిష్యత్తులో భారత్ లో ఫేస్బుక్ వినియోగం మరింత పెరగనుందని చెప్పవచ్చు .

English summary