ఒబెసిటీ@6.91 కోట్లు

7 Crore Indians Have Obesity

06:31 PM ON 9th March, 2016 By Mirchi Vilas

7 Crore Indians Have Obesity

దేశంలో స్థూలకాయుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో 6.91 కోట్ల మంది స్థూలకాయులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్‌ఐ) 25 కంటే ఎక్కువ ఉన్న స్థితిని స్థూలకాయంగా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2013లో వీరి సంఖ్య 6.5 కోట్లుగా ఉందని, 2014లో ఇది 6.68 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే పురుషుల్లో 22.2 శాతం, మహిళల్లో 29.9 శాతం స్థూలకాయులతో పంజాబ్‌ తొలి స్థానంలో ఉంది. పురుషుల్లో 17.8 శాతం, 16.8 శాతం, మహిళల్లో 28.1 శాతం, 26.4 శాతంతో కేరళ, ఢిల్లీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. బిహార్‌, మేఘాలయ రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని చోట్ల పురుషుల కంటే మహిళలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. పురుషుల్లో 4.8 శాతం, మహిళల్లో 7.1 శాతం స్థూలకాయులతో త్రిపుర చివరి స్థానంలో ఉంది.

English summary

Health Minister of India J.P.Nadda announced the obesity people in India.In India there were 6.91 crore Obesity People.Punjab stands in the first Place.