వ్యాయామం కోసం ఓ స్మార్ట్‌ యాప్..!

7 Daily Moves Fitness App

12:28 PM ON 7th March, 2016 By Mirchi Vilas

7 Daily Moves Fitness App

ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ తో గడుపుతున్నారు. వ్యాయామం చేయడానికి కూడా చాలా మందికి టైమ్ సరిపోవడం లేదు. దీంతో పొట్ట, ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త స్మార్ యాప్ వచ్చేసింది. కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారికి, ఇప్పటికే చేస్తున్న వారికి సులువుగా ఎక్సర్‌సైజ్‌లను ఎలా చేయాలో తెలియజేసేందుకు 7 డైలీ మూవ్స్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఆయా యాప్ స్టోర్‌లో లభిస్తుంది. ఐఓఎస్ 8.0, ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 7 డైలీ మూవ్స్ యాప్‌లో ఏయే ఎక్సర్‌సైజ్‌లను ఎలా చేయాలో తెలిపే చిన్నపాటి జిఫ్ ఇమేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు వాటి కింద సదరు ఎక్సర్‌సైజ్‌ను ఏరోజు ఎంత సేపు ఎన్ని రౌండ్ల పాటు చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు. దాదాపు 50కి పైగా వివిధ రకాల వ్యాయామాల గురించి యానిమేటెడ్ బొమ్మల రూపంలో ఈ యాప్ ద్వారా వివరిస్తున్నారు.

English summary

A new fitness app that allows user to do Quick and effective Workouts designed by Fitness Experts. The features in the app like More than 50+ workouts,Animated exercises with step by step instructions,Playable Instruction, while workout or any time during the Rest,Create custom workouts by choosing the exercise from multiple options for every move,Save any workouts under "My Workouts"