విమానం టాయ్‌లెట్‌లో 7కేజీల బంగారం!!

7 kgs gold in aeroplane toilet

09:36 AM ON 28th April, 2016 By Mirchi Vilas

7 kgs gold in aeroplane toilet

అవును, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కిలోల బంగారం విమానం టాయ్‌లెట్‌లో లభ్యమైంది. ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో లభించిన ఓ నలుపు రంగు సంచిలో ఉన్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానం టాయ్‌లెట్‌లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బంది కూడా తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాధారణమే. ఈ క్రమంలో బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయ్‌లెట్‌లో ఓ మూల బంగారు ఆభరణాలతో నిండిన సంచి లభ్యమైంది.

7.124 కిలోల బరువున్న ఆ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ లెక్కిస్తున్నామని, అంతకంటే ముందు ఈ సంచి ఎవరిదనే విషయం పై దర్యాప్తు చేస్తున్నామని గోవా డివిజన్ కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. మొత్తానికి స్మగ్లింగ్ వ్యవహారమే ఇది.

English summary

7 kgs gold in aeroplane toilet. 7.124 kilograms gold was identitfied in aeroplane toilet.