మీలో ఈ అర్హతలు ఉంటే చాలు.. నెలకు 7 లక్షలు జీతం!

7 lakhs salary for girls in Chennai

12:05 PM ON 11th August, 2016 By Mirchi Vilas

7 lakhs salary for girls in Chennai

మీకు చదువు, సర్టిఫికెట్లతో పని లేదు, మీలో ఇవి ఉంటే చాలు నెలకు ఏడు లక్షల జీతం. ఇంతకు అవి ఏంటో అని డౌట్ వస్తుంది కదూ.. అయితే అసలు విషయంలోకి వెళదాం.. కావాల్సింది కాస్తో కూస్తో అందం, ఆడవాళ్లు అయి ఉండాలి. అంతే ఈ మాత్రం అర్హతలు ఉంటే చాలు.. నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటి అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్ ఉదంతాన్ని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను నెలవారీ ప్రాతిపదికన నగరానికి తెచ్చి వారికి నెలకు రూ. 7 లక్షలను వేతనంగా ఇస్తున్నారట. విమానాల్లో మాత్రమే తిరిగే ఈ అమ్మాయిలను ఫైవ్ స్టార్ హోటల్స్, లేదా డబ్బున్న బడాబాబుల వద్దకే పంపుతారట.

నగరంలో విస్తృతంగా సాగుతున్న వ్యభిచార దందాకు అడ్డుకట్ట వేసేందుకు నిశ్చయించిన వ్యభిచార నిరోధక శాఖ అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లపైనా దాడులు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని వ్యభిచార గృహాల్లో సోదాలు జరుపుతూ, బ్రోకర్లను, యువతులను అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో లేడీ సీఐ బుల్లెట్ రాజేశ్వరి, శంకర్ నారాయణన్ నేతృత్వంలోని బృందం, ఓ ప్రముఖ హోటల్ పైన, అనంతరం అక్కడ లభించిన ఆధారాలతో ఎంఆర్సీ నగర్ లోని ఓ ప్రముఖుడి ఇంట్లోను తనిఖీలు చేశారు. అక్కడ నలుగురు యువతులు, దిలీప్ సింగ్ ఫైజల్ అనే బ్రోకర్లను అరెస్ట్ చేసి విచారించారు. ముంబై, కోల్ కతా నగరాల యువతులకు నెలకు రూ. 7 లక్షలు ఇస్తున్నామని, వారి కాంట్రాక్టు పూర్తికాగానే పంపుతున్నామని వీరు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తామని, కారుల్లో పంపుతుంటామని విచారణలో వీరు తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్టు పోలీసులు తెలిపారు.

English summary

7 lakhs salary for girls in Chennai