7కాళ్ళ వింతదూడ పుడితే ఏం చేశారో తెలుసా?

7 legs weird veal

12:28 PM ON 10th November, 2016 By Mirchi Vilas

7 legs weird veal

చెన్నై ఈరోడ్డు జిల్లాలో ఓ జెర్సీ ఆవు ఏడు కాళ్లతో వున్న వింత దూడకు జన్మనిచ్చింది. అంధియూర్ కు చెందిన చిన్నస్వామి అనే రైతు ఐదు పాడిపశువుల్లో జెర్సీ ఆవు వారం రోజుల క్రితం దూడను ప్రసవించింది. సహజంగా నాలుగు కాళ్లు ఉండాల్సిన దూడకు ఏడు కాళ్లు ఉండడంతో ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. దీనిపై చిన్నస్వామి అందజేసిన సమాచారంతో బర్గూర్ పశుసంవర్ధక కేంద్ర వైద్యుడు కుమరవేల్ ఆ దూడను పరిశీలించారు. అంధియూర్ ప్రాంతంలో రెండు తలలతో దూడలు జన్మించడం సహజమేనని, అయితే ఏడు కాళ్లతో దూడ పుట్టడం ఇదే మొట్టమొదటిసారి అని డాక్టర్ కుమర వేల్ అన్నారు.

ఇదిలావుండగా, ఈ వింత దూడను పశుసంవర్ధక వైద్యకళాశాల విద్యార్థుల పరిశోధనల కోసం అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.. దీంతో నామక్కల్ వెటర్నరీ వైద్యకళాశాల పరిశోధన కేంద్రానికి ఈ దూడను తరలించారు.

English summary

7 legs weird veal