సౌత్‌లో 7 భారీ చిత్రాలు ఇవే !!!!

7 Most Expensive South Indian Movies

12:38 PM ON 26th December, 2015 By Mirchi Vilas

7 Most  Expensive South Indian Movies

బాలీవుడ్‌  సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సౌత్‌ సినిమాలు ఉన్నాయనడంలో ఏ విధమైన సందేహం లేదు. సౌత్‌ సినీ ఇండస్ట్రీలోని అనేక సినిమాలు బాలీవుడ్‌ సినిమాలను తలదన్నేలా చిత్రీకరించి శభాష్ అనిపించారు .దక్షిణ భారతదేశంలోని వివిధ సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి బంపర్ హిట్లు అందుకున్న సందర్భాలు అనేకం . సౌత్ లో ఇప్పటి వరకు విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాలను ఇప్పుడు చూద్దాం.

1/8 Pages

7. కత్తి (90 కోట్లు)

భారీ బడ్జెట్‌ తో వచ్చిన సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌ లో విజయ్‌ నటించిన 'కత్తి' సినిమా కూడా ఒకటి. అయ్యింగారన్‌ ఇంటర్‌నేషనల్‌ బ్యానర్‌ పై మురుగదాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌, సమంత  హీరోహీరోయిన్లుగా నటించి అలరించారు. విజయ్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం ఈ సినిమాకే  హైలైట్‌గా నిలిచింది . 2014లో వచ్చిన ఈ చిత్రం సినీ ఇండస్ట్రీ లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

English summary

South Indian movie also taking care of technical values and making movies in international standards and increased budget for some movies. Here you can check the top 7 high budget south indian movies.