ఆట.. తీరిన తీట!

7-year-old spends over $5K playing Jurassic World

06:48 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

7-year-old spends over $5K playing Jurassic World

ఆట కోసం.. ఆ కొడుకు చేసిన పని ఆ తండ్రికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ ససెక్స్‌ కౌంటీకి చెందిన ఓ వ్యక్తి కార్పెట్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఓ స్టోర్ కు వెళ్లిన అతను డబ్బు చెల్లించడానికి బ్యాంకు కార్డు ఉపయోగించగా రిజెక్ట్‌ అయింది. లక్షల్లో ఉండాల్సిన డబ్బు ఏమైందో అర్థం కాలేదు. అకౌంట్‌ వివరాలు పరిశీలిస్తే తల బొప్పికట్టింది. ఎందుకంటే అతని అకౌంట్‌ నుంచి ఐదు రోజుల్లో 60 సార్లు ఐట్యూన్స్‌కి 3,911 పౌండ్లు చెల్లించినట్లు తేలింది. అతని ఏడేళ్ల కొడుకు కొన్నాళ్లుగా తండ్రి ఐ ప్యాడ్‌తో డైనోసర్‌ వీడియో గేమ్‌ ఆడేస్తున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ గేమ్‌లో లెవెల్స్‌ మీద లెవెల్స్‌ దాటేస్తు తండ్రి డబ్బు కరిగించేశాడు. అప్‌గ్రేడ్‌లపై క్లిక్‌లు కొట్టేస్తున్నాడు. రకరకాల డైనోసర్లను కొనేస్తున్నాడు. వాటితో డైనోసర్‌ పార్క్‌ని ఏర్పాటు చేశాడు. ఆట అనుకుంటున్నాడే కానీ తాను నిజంగా డబ్బు చెల్లించేస్తున్నట్లు ఆ చిన్నారికి తెలియలేదు. డిసెంబర్ 13 నుంచి 18 తేదీల్లోపు.. అంటే ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 4 లక్షలు మాయమయ్యాయి. తన కొడుకు తెలియక చేసిన పొరపాటని, తన డబ్బును వెనక్కి ఇవ్వాలని యాపిల్‌ సంస్థని ఆ తండ్రి అభ్యర్థించాడు. తన కుమారుడు చిన్నవాడని, అతనికి డబ్బు విలువ తెలియదని వాపోయాడు.

యాపిల్‌ మాత్రం తన వెబ్‌సైట్లో ఈ విషయమై ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు పాస్‌వర్డ్‌ల విషయమై జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి సంఘటన జరిగి తమ దృష్టికి రావడం ఇదే తొలిసారని చెప్పింది.

English summary

A seven year old boy spends 4 lakh rupees in Itunes from his fathers bank account.He spend that much ammount for game upgrades in his apple i-pad