ఫేస్‌బుక్‌పై  రూ.74లక్షలు జరిమానా ....

74 Lakhs Fine To Facebook

05:05 PM ON 1st March, 2016 By Mirchi Vilas

74 Lakhs Fine To Facebook

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ప్రఖ్యాత సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ కి ఊహించని షాక్ తగిలింది. ఫేస్ బుక్ పై జర్మనీలోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. వినియోగదారుల డేటాకు సంబంధించి నిబంధనలలో మార్పులు చేయాలన్న కోర్టు ఆదేశాలను ఫేస్‌బుక్‌ తక్షణం అమలు చేయకపోవడంతో బెర్లిన్‌లోని ఓ స్థానిక కోర్టు 109330 అమెరికా డాలర్ల(సుమారు రూ.74లక్షలు) జరిమానా విధించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే, జర్మనీలో గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతివివక్ష, ద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో నిర్మూలించే దిశగా సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని గతంలో ఫేస్‌బుక్‌పై ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ బెర్లిన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఫేస్‌బుక్‌లో చేయాల్సింది ఇంకా చాలా ఉందని, అందుకు కట్టుబడి కృషి చేస్తున్నామని కూడా చెప్పారు.

ఫేస్‌బుక్‌ నియమనిబంధనల ప్రకారం వినియోగదారుల ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ డేటాకి సంబంధించి ఫేస్‌బుక్‌ పేర్కొన్న నియమావళిపై కేసు విచారణ జరిగింది. ఫేస్‌బుక్‌ నియమనిబంధనలను మార్చాల్సిందిగా కోర్టు ఆదేశించింది. తాము కోర్టు ఆదేశాలను పాటించినప్పటికీ, మార్పులు చేయడంలో జాప్యం జరిగినందున, సకాలంలో చేయనందుకు న్యాయస్థానం తమకు జరిమానా విధించిందని, అక్కడి ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి చెబుతూ, తాము జరిమానా చెల్లిస్తామని వెల్లడించారు. మొత్తానికి సోషల్ మీడియాలో అగ్రగామిగా ఎదుగుతున్న ఫేస్బుక్ కి జర్మన్ కోర్ట్ షాకివ్వడం చర్చకు దారితీస్తోంది.

English summary

Worlds Popular Social Networking Site Facebook Had Fined with 74 lakhs by the Germany Court or refusing to follow an order.