వావ్... 76 ఏళ్ళ వయస్సులోనూ ఆమె గ్రేటే (వీడియో)

76 years old woman fighter in Kerala

11:31 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

76 years old woman fighter in Kerala

నిజంగా ఇది గ్రేటే.. ఎందుకంటే ఈమె కృషి అలాంటిది. వివరాల్లోకి వెళ్తే, కేరళలోని వటకార ప్రాంతానికి వెళ్తే అక్కడ 76 ఏళ్ళ మీనాక్షమ్మ అనే వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె.. వణుక్కుంటూ సణుక్కునే సాదాసీదా ముసలామె అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కర్ర, కత్తి సాములో నాకెవరూ సాటి రారంటుంది. ఈ విద్యలో ఈ వయస్సులోనూ వావ్ అనిపిస్తోంది. కేరళలో ఈ విద్యను కలరియపాయత్తు అంటారట. కర్రలు, కత్తులు, డాలు, డ్యాగర్లతో ఈమె తన ప్రత్యర్థిని మట్టి కరిపించడంలో దిట్ట.

తన శిష్యులకు ఈ విద్య నేర్పిస్తూ సదా బిజీగా ఉంటుంది. ‘ఎరైజింగ్’ ఇండియా అనే టైటిల్ తో మీనాక్షమ్మ చేసే కర్రసామును ఇటీవల ఒకరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే సుమారు 9 లక్షలమంది ఆశ్చర్యంగా చూశారట. చీర కొంగును నడుముకి బిగించి మీనాక్షమ్మ తన కన్నా చిన్నవాడైన తన శిష్యునితో చేసిన కర్రసాము అబ్బో అనిపిస్తుంటే చూసినోళ్ళంతా హర్షాతిరేకంతో ఒకటే ఈలలు.. కేకలు. మరి మనం కూడా ఓ లుక్కేస్తే పోలే ..

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: హీరోలు వారి మేనరిజం

English summary

76 years old woman fighter in Kerala. Her Name Meenakshiamma she teaches kalarippayattu.