తమిళనాట ఎన్నికల వేళ రూ.765 కోట్లు స్వాధీనం

765 Crores Caught In Tamilnadu

12:01 PM ON 14th May, 2016 By Mirchi Vilas

765 Crores Caught In Tamilnadu

తమిళనాట ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయత్రంతో తెరపడబోతోంది. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు తెరవెనుక కసరత్తు లో నిమగ్నమయ్యాయి. తాయిలాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మరో 24గంటల్లో పోలింగ్‌ జరగబోతున్న తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు భారీగా నగదు గుర్తించారు. తిర్పూరులో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, అలాగే కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందిందని తరలిస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. అయితే ఇది నిజంగా బ్యాంకులకు చెందిన నగదో కాదో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఓటర్లకు పంచడానికి తీసుకెళ్ళే సొమ్ము అయితే మాత్రం ఇంత నగదు ఏ పార్టీదో మరి.

ఇవి కూడా చదవండి:మందు బాటిల్‌తోనే ఎన్నికల ప్రచారం

ఇవి కూడా చదవండి:దాసరి-పవన్ కాంబినేషన్ లో 'సత్యాగ్రహి'

ఇవి కూడా చదవండి:'కబాలి' ని కొనలేక చేతులెత్తేసిన దిల్ రాజు

English summary

Tamilnadu Police caught 765 crores in Various Areas in Tamilnadu . But the people who were carrying money were saying that it was bank money. Police were investigating about that money.