తాను సంపాదించిందంతా రాసిచ్చేశాడు... ఎంతో తెలిస్తే షాకవుతాం!

77 years old Librarian gave his assets to University

11:17 AM ON 6th September, 2016 By Mirchi Vilas

77 years old Librarian gave his assets to University

అపర దాన కర్ణులని వింటుంటాం. ఇప్పుడు వ్యక్తి ఒకడున్నాడు. సాధారణంగా యూనివర్శిటీ చదువు పూర్తవగానే కొందరు వ్యాపారాలు చేస్తే.. మరికొందరు ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడతారు. పేరు, డబ్బులు సంపాదించాక అందులో కొందరు తాము చదువుకున్న యూనివర్శిటీ రుణం తీర్చుకునేందుకు వర్శిటీకి కావాల్సిన సామాగ్రినో, కొంత డబ్బో విరాళంగా ఇస్తుంటారు. కానీ, ఓ సామాన్య వృద్ధుడు మాత్రం తాను జీవితాంతం చెమటోడ్చి సంపాదించిన డబ్బునంతా యూనివర్శిటీకే విరాళంగా ఇచ్చేశాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ మొరిన్ అనే 77ఏళ్ల వృద్ధుడు న్యూ హంప్ షైర్ యూనివర్శిటీలో 1961లో డిగ్రీ పూర్తి చేసి, అందులోనే లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరాడు.

1/3 Pages

50ఏళ్లు అక్కడే విధులు నిర్వర్తిస్తూ, గత ఏడాది మరణించాడు. అయితే తాజాగా న్యూహంప్ షైర్ యూనివర్శిటీకి మొరిన్ కి చెందిన 4 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 27కోట్ల రూపాయలు) చెక్కు అందింది. మొరిన్ మరణాంతరం తాను సంపాదించిన డబ్బు అంతా యూనివర్శిటీకే చెందాలని తన ఆర్థిక సలహాదారుతో చెప్పాడట. అందుకే అతను యూనివర్శిటీకి ఆ చెక్ ను అందించారు. దీంతో యూనివర్శిటీలో లైబ్రేరియన్ గా పని చేసిన ఒక ఉద్యోగి నుంచి కోట్ల రూపాయల విరాళం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొరిన్ జీవితకాలంలో ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్లలేదని.. ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదని, పాత కారులోనే తిరిగేవాడని మొరిన్ ఆర్థిక సలహాదారు తెలిపారు.

English summary

77 years old Librarian gave his assets to University.