ఓపిక వుంది... పాక్ పంపండి.. పగ తీర్చుకుంటానన్న 78 ఏళ్ళ వృద్ధుడు!

78 years Jagnarine Singh says that i will go to pakistan to kill terrorists

02:16 PM ON 21st September, 2016 By Mirchi Vilas

78 years Jagnarine Singh says that i will go to pakistan to kill terrorists

పాక్ చేసిన దుశ్చర్య తలచుకుంటే, రక్తం మరిగిపోతోంది చాలామందికి. నిద్రిస్తున్న జవాన్లపై గ్రనేడ్లతో దాడికి తెగబడ్డ ముష్కరుల వెనుకా ఎవరున్నా వారి అంతు చూడాలని అంటున్నారు. కొంతమంది యువకులు.. పుట్టుకతో వృద్ధులు అన్నాడు మహాకవి శ్రీశ్రీ, కానీ వయసుడిగినా చేవ చావలేదని ఈ వృద్ధుడు నిరూపిస్తూ, యువకులకనే ఆశ్చర్యపరిచాడు. బిహార్ కు చెందిన 78ఏళ్ల వృద్ధుడు జగ్ నరైన్ సింగ్ అయితే మరీను. వాస్తవానికి యితడు 20 ఏళ్ల కిందట చూపు కోల్పోయాడు. కానీ మనోస్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. నాకు ఓపిక ఉంది. భారత సైన్యం తరఫున నన్ను పాకిస్థాన్ పంపించండి. నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటా అంటున్నాడు.

ఇతనెవరో కాదు ఉరీ ఘటనలో అసువులు బాసిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్(44) కి తండ్రి. కుమారుని మరణవార్త విన్న తర్వాత అతని నోటి వెంట ఆవేశంగా వచ్చిన మాటలివి. సింగ్ కుటుంబానికి ఇది రెండో విషాదం. పెద్దకుమారుడు కమతా సింగ్ కూడా సైనికుడిగా పనిచేసేవాడు. 1986లో రాజస్థాన్ లోని బికనేర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో అతను అసువులు బాశాడు. తాజాగా రెండో కుమారుడు అశోక్ కుమార్ మరణం సింగ్ కుటుంబానికి రెట్టింపు శోకాన్ని మిగిల్చింది. కేవలం సింగ్ కుమారులే కాదు అతని బంధువులు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. అశోక్ కుమార్ పెద్దకుమారుడు వికాస్ సింగ్ కూడా ఇటీవలే సైన్యంలో చేరారు.

ప్రస్తుతం అతను ధన్ పూర్ కంటోన్మెంట్ లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్ కుమార్ తాత రాజ్ గిరీష్ సింగ్, బాబాయిలు శ్యామ్ నారాయణ్ సింగ్, రామ్ విలాస్ సింగ్ లు సహా మరో ఇద్దరు మేనళ్లుల్లు భారత సైన్యంలో పనిచేశారు. చిన్నకుమారుడి మరణవార్త జగ్ నరైన్ ను తీవ్రంగా కలిచివేసింది. ఉగ్రవాద పీచమణచడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదుగురు భారత జవాన్ల మరణానికి ప్రతిగా 10మంది శత్రువుల తలలు తెగనరకాలి అంటూ 78ఏళ్ల సింగ్ ఆగ్రహంతో వూగిపోయారు. 1992లో సైన్యంలో చేరిన అశోక్ కుమార్ అనేక చోట్ల పనిచేశారు.

ఇటీవలే పశ్చిమ్ బంగాలోని భిన్నగురి నుంచి ఉరీ బెటాలియన్ లోకి వచ్చారు. సరైన వసతి దొరికిన తర్వాత భార్య సంగీతను కూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారట. కానీ ఇంతలోనే ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పదవీవిరమణ అనంతరం పుట్టిన గ్రామానికి తిరిగి రావాలనుకునేవాడని, యువతను కూడా ఆర్మీలో చేరమని ప్రోత్సహించేవాడని అశోక్ కుమార్ గ్రామస్థుడు జితేందర్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇతడి మాటలు విన్న చాలామంది విస్తుపోతున్నారు. అదిరా దేశభక్తి అంటే అంటూ ఉప్పొంగిపోతున్నారు.

English summary

78 years Jagnarine Singh says that i will go to pakistan to kill terrorists