పెషావర్ పాఠశాల దాడి ఘటన నిందితులకు ఉరి అమలు

8 accused people of Peshawar school attack in Pakistan

05:33 PM ON 15th December, 2015 By Mirchi Vilas

8 accused people of Peshawar school attack in Pakistan

పెషావర్ లోని ఒక పాఠశాలపై దాడికి పాల్పడటమే కాక పలువురు విద్యార్థుల మృతికి కారణమైన ఎనిమిది మందిని పాకిస్తాన్‌ అధికారులు మంగళవారం ఉరి తీశారు. గత డిసెంబర్‌లో ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలపై దుండగులు దాడి చేసి 150 మందిని అత్యంత కీరాతకంగా చంపేసిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక శాతం మంది విద్యార్థులే. ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్‌ తమ దేశంలో ఉరి అమలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. నేరం రుజువు కావడంతో నిందితులందరికీ పాక్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దాడి సంఘటన జరిగి బుధవారానికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం వివిధ జైళ్లలో ఉన్న నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేశారు. దీనితో ఉరి అమలుపై నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత ఇప్పటి వరకూ పాకిస్తాన్ లో 310మందిని ఉరి తీశారు.

English summary

8 accused people were hanged who were the accused people in peshawar army school attack in pakisthan