గౌతమిపుత్ర శాతకర్ణిలో 8 కోట్ల వార్ సీన్

8 Crores For War Seen in Gautamiputra Satakarni

04:41 PM ON 6th May, 2016 By Mirchi Vilas

8 Crores For War Seen in Gautamiputra Satakarni

హిందూపురం శాసన సభ్యుడు , సినీ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ తన 100 వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి " . కంచె సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:ఇంత హాట్ అమ్మాయిని 3 జన్మలుగా చూడలేదు: వర్మ

బాలయ్య 100వ చిత్రం షూటింగ్ ఈ నెల 7 వ తారీఖు నుండి మొరాక్కో లో ప్రారంభంకానుంది . ఛారిత్రాత్మక చిత్రం గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో 8 కోట్ల వ్యయంతో ఒక భారి ఫైట్ ను తెరకెక్కించనున్నారని ఫిలింనగర్ టాక్ . ఈ భారి ఫైట్ సీక్వెన్స్ మొత్తం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికే హైలైట్ నిలుస్తుందని అంటున్నారు. ఈ ఫైట్ సీన్ కోసం 4 బృందాలు , 800 మంది జూనియర్ ఆర్టిస్టులు , అనేక ఆయుధాలు , వివిధ రకాలైన బట్టలు వంటివి ఈ భారీ వార్ సీన్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించబోతున్నారట. ఇప్పటికే ఈ వార్ సీన్ కు కావాల్సినవన్నీ షూటింగ్ స్పాట్ కు చేరుకున్నాయట . ఈ చిత్రం బాల కృష్ణ సినిమా కెరీర్ లోనే మొట్ట మొదటిసారిగా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది . ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట.

ఇవి కూడా చదవండి:బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి:మంటతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు

English summary

Tollywood Hero and Hindupuram MLA Nandamuri Bala Krishna was going to act in the movieNamed Gautamiputra Satakarni under the direction of Director Krish. Recently a news came to know that this movie unit was going to shoot a war sequence with a huge amount of 8 crores. This movie shooting was going to be start from 7th may.This movie was planning to release on Next Year on Sankranti Festival.