అందమైన గోర్లు సొంతం చేసుకోండిలా !!

8 Foods for beautiful nails

01:03 PM ON 1st December, 2015 By Mirchi Vilas

8 Foods for beautiful nails

కొంతమందికి గోర్లు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. అందమైన మెరిసే గోర్లు ఎవరు వద్దంటారు చెప్పండి. ఇంట్లో ఉంటూనే గోర్లును ఆరోగ్యవంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కోన్ని పదార్ధాలను తినటం వలన సాధ్యం అవుతుంది.

1. సాల్మన్ చేప

దీనిలో ఎక్కువ మొతాదులో విటమిన్‌ డి మరియు ప్రోటీన్స్‌ ఉంటాయి . ప్రోటీన్స్‌ కొల్లాజన్‌ ని ఉత్పత్తి చేస్తుంది. గోర్లు, జుట్టు మరియు చర్మం పెరుగుదలకు కొల్లాజన్‌ సహకరిస్తుంది. ఈ సాల్మన్‌ చేప లో మిటమిన్‌ డి ఉండటం వలన గోర్లు, జుట్టు, రోధనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతమైన మరియు అందమైన గోర్లును మీ సొంతం చేస్తుంది.

2. గుడ్డు

గుడ్డులో ఎక్కువ మోతాదు లో బయోటిన్‌ విటమిన్‌ ఉంటుంది. ఈ విటమిన్‌ జుట్టు పెరుగుదలకు, గోర్లు పెరగడానికి సహయపడుతుంది. ఇది గోర్లు పెరగడంలో సహయపడడమేకాక అందంగా కనబడేలా చేస్తుంది. గుడ్డులో అధిక మోతాదులో విటవిన్‌ డి మరియు ప్రోటీన్స్‌ కూడా ఉన్నాయి. ఇవి కూడా గోర్లు పెరుగుదలకు సహాయపడి గోర్లను బలంగా చేస్తాయి.

3. బ్రోకలీ

ఇది అందిరికీ తెలిసిన ఆకుకూర. ఇది ఆర్యోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన గోర్లు పెరుగుదలకు సహయపడుతుంది. దీనిలో ఎక్కువ మోతాదులో సిస్టైన్‌, ఎమినో ఆసిడ్ కలిగి ఉండడం వలన గోర్లను ఆరోగ్యవంతం గా పెంచడం లో సహాయపడుతుంది.

4. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె వల్ల మన శరీరానికి విటమిన్‌ డి, కె, ఎ లను గ్రహించే శక్తి లభిస్తుంది. ఈ విటమిన్లు గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడాతాయి. ఈ నూనె లోని పోషకాలు గోళ్ళను దృడంగా ఆరోగ్యంగా ఉంచుతాయి దీనిలో పాటు ప్రకాశవంతం గా తయారవుతాయి.

5. చికెన్‌

దీనిలో పోషకాల వలన శరీర కణజాలాన్ని నిర్మించటంతో పాటు బలమైన, అందమైన గోర్లును అందించడంలో చికెన్‌ సహాయపడుతుంది. దీనిలో విటవిన్‌ బి మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. చికెన్‌ లో జింక్‌ ఉండటంవలన గోర్లను అందం గా చేయడం లో సహాయపడుతుంది. ప్రోటీన్స్‌, జింక్‌ మరియు విటమిన్‌ బి ఉండటం వలన గోర్లు దృడంగా పెరిగేలా సహాయపడుతుంది. మీరు మీ ఆహారంలో చికెన్‌ ని జోడించడం వలన అందమైన గోర్లు సోంతంచేసుకోవచ్చు.

6. పాలకూర

అన్ని ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క పాలకూరతోనే కాకుండా అన్ని ఆకుకూరలతోనూ విటమిన్‌ బి, సి, ఫోలిక్ ఆసిడ్‌, ఐరన్‌, విటమిన్‌ ఎ మరియు విటమిన్‌ ఇ కలిగి ఉండటం వలన ఇవి ఆరోగ్యానికే కాకుండా దృడమైన గోర్లు పెరుగాడానికి కూడా దోహదపడతాయి. మీరు రోజు వారి తీసుకోనే ఆహారంలో ఆకుకూరలు తప్పని సరిగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి అలాగే అందమైన గోర్లుకు ఎంతో ఉపయోగపడుతుంది.

7. ఆపిల్‌

ప్రపంచంలోనే ఆపిల్‌ కంటే గోప్ప ఆహారం లేదంటున్నారు నిపుణులు. దీనిని రోజూ తినడంవలన చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఇది గోర్లును కూడా ఆరోగ్యవంతంగా పెగిగేలా చేస్తుంది. దీనిలోని అధిక మెతాదులో పోషకాలు మరియు ఖనిజాలు గోర్లు ఆరోగ్యవంతంగా పెరుగడంలో సహయపడతాయి.

8. మంచి నీరు

శరీరనికి సరిపడినంత నీటిని తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో మలినాలను పారద్రోలి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీంతో పాటు శరీరాన్ని డీ హైడ్రేట్‌ కాకుండా చూసుకుంటుంది. ఇది గోర్లును ఆరోగ్యవంతగా పెరగడంలో సహాయపడుతుంది.

English summary

8 Foods for beautiful nails. There are very few girls in this fashion world who are not crazy for long and beautiful nails.