ఔటర్ దగ్గర ఘోర ప్రమాదం - 8 మంది యువకుల దుర్మరణం

8 People Died In A Car Accident In Medchal

11:14 AM ON 31st August, 2016 By Mirchi Vilas

8 People Died In A Car Accident In Medchal

ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంతోమంది పుత్ర శోకంతో బాధ పడుతున్నా కొందరు యువకులకు అస్సలు జ్ఞానోదయం కలగడం లేదు. ఉత్సాహం ఉరకలు వేసే కుర్రాళ్లు చేస్తున్న ఆదమరిచి ఉండడం వలన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తొమ్మిది మంది యువకులు, అందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులే. స్నేహితురాలి పెళ్లి విందుకు ఒకే వాహనంలో బయల్దేరారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి, జోకులు వేసుకుంటూ నవ్వుతూ తుళ్లుతూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంతలో వారు ప్రయాణిస్తున్న వాహనం ఔటర్ రింగురోడ్డుపై టోల్ గేటు వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ నిలిచి ఉన్న వాహనాల వెనక నిలిచింది.

అంతలోనే, విపరీతమైన వేగంతో మృత్యుశకటంలా వారి వాహనంపైకి డీసీఎం వ్యాను దూసుకొచ్చింది. ఆ యువకులు ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొంది. ఆ తాకిడికి యువకుల వాహనం ముందున్న మరో లారీని ఢీకొంది. రెండు లారీల మధ్య నజ్జునజ్జయిపోయింది. లోపలున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది కుర్రాళ్లు నలిగిఛిద్రమైపోయారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారి గూడ వద్ద జరిగిందీ విషాదం.

మెదక్ జిల్లా సదాశివ పేటకు చెందిన తొమ్మిది మంది యువకులు స్నేహితురాలి పెళ్లి విందుకు హాజరయ్యేందుకు బయలుదేరారు. హైదరాబాద్ శివారులోని కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్ లో జరుగుతున్న విందుకు షకావత(30)కు చెందిన సొంత టవేరా వాహనంలో ప్రయాణమయ్యారు. షకావత స్వయంగా వాహనాన్ని నడుపుతున్నాడు.

సుతారిగూడ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టోల్ గేటు వద్ద టోల్ చెల్లించేందుకు వీరు తమ వాహనాన్ని నిలిపారు. వీరు ముందు వీఆర్ ఎల్ ట్రాన్స్ పోర్టు లారీ నిలిచి ఉంది. టవేరా వాహనం టోల్ గేటు వద్ద ఆగిన వెంటనే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాను దాన్ని ఢీకొంది. దీంతో టవేరా ముందు ఆగి ఉన్న లారీని ఢీకొంది. టవేరాను ఢీకొన్న డీసీఎం వేగం అదుపులోకి రాకపోవడంతో టవేరా రెండు వాహనాల నడుమ చిక్కుకుని నుజ్జునుజ్జయింది. టవేరాలోని ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాత్కాలిక టోలు గేటు వద్ద ఎలాంటి వేగ నియంత్రణ ఏర్పాట్లు లేకపోవడంతోపాటు వెనుక నుంచి అతి వేగంగా డీసీఎం దూసుకురావడం ఘోర ప్రమాదానికి కారణమైంది. లారీల నడుమ చిక్కుకున్న టవేరాను క్రేన్ సాయంతో బయటకు లాగి అందులోని మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన వారిని, మహ్మద్ అఖిల్ (23), మహ్మద్ ఇమ్రాస్ (23), షకావత (30), ఫిరోజ్ (23), మహ్మద్ ఇర్ఫాన్ (23), మహ్మద్ అక్బర్ , మహ్మద్ నిషాద్ గా గుర్తించారు. అబ్బాస్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి:శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

ఇవి కూడా చదవండి:పతకాల గురించి రామ్ దేవ్ షాకింగ్ కామెంట్స్

English summary

Car Accident killed 8 people in Medchal today. 8 People Named Md.Akhil(23),Md.Imran(23),Shakavata(30),Md.Irfan(23),Md. Akbar,Md. Nishaad were died in this accident and another guy named Abbas was suffering with severe injuries. When these people were going to home from marriage in their own car, they stopped behind a lorry at toll gate and suddenly a fast coming DCM hits the Tavera car back. 8 people were died in this incident and 1 was suffering with severe injuries in a critical situation.