ప్రపంచం మొత్తంలో ఒక్క ఇండియాలోనే 8 రకాల న్యూఇయర్స్ చేసుకుంటాం.. అవేంటో తెలుసా?

8 type of new years in India

12:50 PM ON 31st August, 2016 By Mirchi Vilas

8 type of new years in India

ఎన్నో భాషలు, ఆచార వ్యవహారాలతో భారతదేశం వివిధ సంస్కృతుల సమ్మేళనం. సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలతో భారతదేశ కీర్తి చాలా గొప్పస్థానానికి వెళ్తుంది. అందుకే.. న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకునే విధానంలో ఇండియా చాలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఎక్కడాలేని విధంగా ఇండియాలో కొత్త ఏడాదికి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది రకాలుగా వెల్ కమ్ చెప్తారు. ప్రపంచంతో పాటు ఇండియా కూడా.. జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది. దేశమంతా.. కొత్త ఏడాదితో ఎంతో సంతోషంగా, గ్రాండ్ గా స్వాగతం పలుకుతారు.

అలాగే వివిధ రాష్ట్రాలు తమ పంట చేతికి వచ్చిన సమయాన్ని బట్టి, లేదా వాళ్ల వాళ్ల ఆచారాలు, పంచాగాన్ని బట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే న్యూ ఇయర్ విశేషాలు ఓసారి పరిశీలిద్దాం..

1/9 Pages

1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక...


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వాసులు కొత్త ఏడాదిని ఉగాదిగా జరుపుకుంటారు. చైత్రమాసంలో అంటే మార్చ్ లేదా ఏప్రిల్ ఈ పండుగ చేసుకుంటారు. ఈ పర్వదినాన కుటుంబ సభ్యులంతా కలిసి గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ ఉగాదికి ప్రత్యేకంగా తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు కలిసిన పచ్చడి చేసుకుని తినడం ఆనవాయితీ. అలాగే ఈ పండుగ రోజు ఆలయాల్లో పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం వంటివి ఏర్పాటు చేసుకుంటారు.

English summary

8 type of new years in India. In India their are 8 type of New Years were celebrated.