80 ఏళ్ల బామ్మ కోరిక తీర్చడానికి 30మంది క్యూ కట్టారు

80 Years Grandmother Rides With 30 Bikers On Her Birthday

12:00 PM ON 16th August, 2016 By Mirchi Vilas

80 Years Grandmother Rides With 30 Bikers On Her Birthday

అవునా, అంటే అవును. 8పదుల వయస్సులో ఆ బామ్మ కోరిన వింత కోరిక అలాంటిది మరి. అయితే దాన్ని తీర్చడానికి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 30మంది క్యూ కట్టారు. ఇంతకీ ఆమె ఏ వింత కోరిక కోరిందని అనుమానం రావచ్చు. ఓ 80 ఏళ్ల తల్లి చెప్పిన కోరిక విని కూతురు ఆశ్చర్యపోయింది. అయితే ఈ వయసులో ఇదేం పిచ్చి అని తల్లిని కోప్పడలేదు. పైగా తల్లి కోరిక తీర్చేందుకు స్నేహితుడి సాయం కోరింది. అతడు స్పందించి సోషల్ మీడియా ఆశ్రయించాడు. అంతే సరిగ్గా తల్లి బర్త్ డే నాడు 30 మంది వచ్చి ఆమె ఇంటిముందు వాలిపోయారు. వారిని ఆ కూతురు చూపించడంతో తల్లి ఆశ్చర్యంలో మునిగిపోతూ తెగ సంబర పడింది. ఇంతకీ అసలు కథ ఏమిటంటే,

లాంక్ షైర్ లోని బోల్టన్ కు చెందిన షీలా హర్ స్ట్(80) తన పుట్టిన రోజునాడు ట్రైక్ మోటార్ సైకిల్ నడపాలనుందని కుమార్తె దగ్గర తన కోరిక బయటపెట్టింది. అయితే తమ వద్దనున్న బైక్ చెడిపోవడంతో ఏం చేయాలో కుమార్తె శామ్ కు తోచ లేదు. ఒకసారి ఆలోచించాక, తనకు తెలిసిన బైకర్ ఫ్రెండ్ మైక్ క్వీన్ లాండ్ కు తన తల్లి కోరిక గురించి వివరించి, అతడి సాయం అభ్యర్థించింది. రోడ్ రిపేర్స్ ఎంసీసీ చైర్మన్ అయిన మైక్ వెంటనే తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయం గురించి పోస్టు పెట్టాడు. ట్రైక్ మోటారు సైకిలు ఉన్నవారు బామ్మ కోరిక నెరవేర్చేందుకు ముందుకు రావాలని ఆహ్వానించడంతో . దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.
. మరోవైపు బర్త్ డే నాడు తన కోరిక తీరే మార్గం కనిపించక కనీసం తన ఫ్యామిలీ కారునైనా నడపాలని షీలా నిశ్చయించుకుంది. ఇంతలోనే అకస్మాత్తుగా ఆమె చేతిలో హెల్మెట్ పెట్టేసరికి ఆనంద భాష్పాలు రాలాయి. 30 మంది ట్రైక్ మోటారు బైకులతో ఇంటిముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె నడిపేందుకు ఓ బైక్ ను అందంగా అలంకరించారు. బెలూన్లు కట్టారు. హ్యాపీ బర్త్ డే అంటూ రాసిన ఉన్న బోర్డు పెట్టారు. అంతే ఆనందంగా బైక్ ను అందుకుని వారితో కలిసి అరగంటపాటు బైక్ పై చక్కర్లు కొట్టింది. చివరి రోజుల్లో తనకు ఇంత ఆనందం లభిస్తుందని ఊహించలేదని షీలా ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పింది. అదండీ కాటికి కాళ్ళు జాపే వయస్సులో ఇదేం కోరిక అనుకుంటాం గానీ, సఫలం చేసుకోవడం కొందరికే సాధ్య పడుతుందని షీలా రుజువుచేసింది.

ఇది కూడా చూడండి: ఈ ప్రదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట!

ఇది కూడా చూడండి: పూజావేళల్లో ఏ ఏ పువ్వులు వాడాలో తెలుసా?

ఇది కూడా చూడండి: మగాళ్ల జ్ఞాపకార్ధం ఆడాళ్లు నిర్మించిన అద్భుత కట్టడాలు..

English summary

80 years old Sheila Hurst given surprise birthday trike ride.