భారతీయుడికి అమెరికాలో  82ఏళ్ల జైలు

82 Years Prison To Indian In America

10:46 AM ON 25th January, 2016 By Mirchi Vilas

82 Years Prison To Indian In America

మనిషి సగటు వయస్సు ఎంత? అతనికి వేసిన శిక్ష ఎంత అని పరిశీలిస్తే, సహజంగానే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఓ న్యాయస్థానం వేసిన శిక్ష కనుక దీనిపై వ్యాఖ్యా నించడం కూడా ఇబ్బందే కదా. ఇంతకీ విషయంలోకి వెళితే, ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన కేసులో భారత్‌కు చెందిన వ్యక్తికి అమెరికాలో 82ఏళ్ల జైలుశిక్ష విధించారు.

ఆ వివరాలు ఇలా వున్నాయి. భారత్‌కు చెందిన అమన్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తికి పరంజీత్‌సింగ్‌ అనే మరో భారతీయుడితో వ్యక్తిగత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో పరంజీత్‌ 2008 ఆగస్టు 31న సక్రామెంటో సిక్కు స్పోర్ట్స్‌ క్లబ్‌లోని ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. ఇదే ఫంక్షన్‌కు మరో సన్నిహితుడితో వెళ్లిన అమన్‌దీప్‌సింగ్‌ అక్కడ పరంజీత్‌తో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి, పరంజీత్‌ను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అమన్‌సింగ్‌ భారత్‌కు పారిపోయాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు భారత అధికారులకు వర్తమానం అందించారు. దీంతో 2013లో పంజాబ్‌లోని జలంధర్‌లో అమన్‌దీప్‌ను అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో జనవరి 22న తుదితీర్పు వెలువరించారు. దాని ప్రకారం అమన్‌దీప్‌ను దోషిగా గుర్తిస్తూ సక్రామెంటో కోర్టు 82ఏళ్ల జైలుశిక్ష విధించింది. మరి శిక్ష అనుభవించడానికి అన్నేళ్ళు బతుకుతాడా? లేక వచ్చే జన్మలో మిగిలిన శిక్షాకాలం పూర్తిచేస్తాడా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

An Indian named Amandeep singh who was living in America was killed Paranjeet Singh in America with Gun for having some personnel clashes . Now a court in America gave judgement that he was in prisoner for 82 long years