రిలీజ్‌ కాకముందే సర్దార్‌కి 85 కోట్లు!

85 crores pre-business for Sardar Gabbar Singh

01:21 PM ON 13th February, 2016 By Mirchi Vilas

85 crores pre-business for Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శరత్‌ మరార్‌ నిర్మాత. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌ కాక ముందే 85 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ లో డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున డబ్బులు పోసి కొనుక్కుంటున్నారు. బిజినెస్‌ లెక్కల ప్రకారం ఇంద్ర ఫిలింస్‌ వారు నైజాం రైట్స్‌ని 21 కోట్లు పెట్టి కొన్నారు, సీడెడ్‌లో 10.5 కోట్లు, ఆంధ్ర మరియు ఇతర చోట్లు కలిపి 25 కోట్లు, ఐడ్రీమ్‌ మీడియా వాళ్ళు ఓవర్‌సీస్‌ రైట్స్‌ని 10 కోట్లు పెట్టి కొనుక్కుంది.

ఇంకా కర్ణాటక, మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్‌గా 'సర్దార్ గబ్బర్ సింగ్' శాటిలైట్‌ రైట్స్‌ని 13 కోట్లకి కొనుక్కున్నారు. ఇంక మొత్తం మీద 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' 80 నుండి 85 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం నిర్మిస్తున్న ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మరియు శరత్‌ మారర్‌ కి కాసుల పంట పండటం ఖాయంగా కనిపిస్తుంది. 'అత్తారింటికి దారేది' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత పవన్‌ నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.

English summary

85 crores pre-business for Power Star Pawan Kalyan Sardar Gabbar Singh movie. This movie is directing by Power fame Bobby.In this movie Kajal Agarwal is romancing with Pawan.