8.5 మీటర్ల భారీ జీసస్ విగ్రహం

8.5 Meters Jesus Statue In Nigeria

12:20 PM ON 1st January, 2016 By Mirchi Vilas

8.5 Meters Jesus Statue In Nigeria

ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఆఫ్రికా దేశం నైజీరియాలో ఆవిష్కరించనున్నారు. నైజీరియాకు చెందిన ఓ వ్యాపారి ఏసుక్రీస్తు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందకు సిద్ధమయ్యాడు. నూతన సంవత్సరం మొదటి రోజున ఆవిష్కరించనున్న ఈ విగ్రహం ఇస్లామిక్ ఉగ్రవాదంతో ధ్వంసమవుతున్న దేశంలో శాంతికి చిహ్నంగా నిలుస్తుందని భావిస్తున్నారు. నైజీరియాలోని ఓ చమురు, గ్యాస్ సరఫరా కంపెనీలో సీఈవోగా ఉన్న ఓబిన్నా ఒనూహ జీసస్ ది గ్రేటెస్ట్ అనే విగ్రహాన్ని నిర్మించే బాధ్యతను 2013లో ఓ చైనా కంపెనీకి అప్పగించారు. ఆఫ్రికా ఖండంలోనే అతి భారీ స్థాయిలో 8.53 మీటర్ల ఎత్తున పూర్తి పాలరాయితో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. పాదరక్షలు లేని ఏసుక్రీస్తు చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్టుండే ఈ విగ్రహం 40 టన్నుల బరువు ఉంటుందని, దీనిని నైజీరియాలోని ఆగ్నేయ రాష్ట్రమైన ఇమోలోగల సెయింట్ అలాయిసియస్ చర్చిపై ప్రతిష్టిస్తామని ఒనూహ పేర్కొన్నారు. ఈ విగ్రహంవల్ల నైజీరియాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

English summary

8.5 Meters Jesus Statue In Nigeria