98 రూపాయలకే 850 ఎకరాలు లీజ్ కు ఇస్తున్నారు!

850 acres farm house for 100 rupees

11:27 AM ON 25th May, 2016 By Mirchi Vilas

850 acres farm house for 100 rupees

మామూలుగా మన దేశంలో చిన్న ఇల్లు అద్దె తీసుకోవాలంటేనే వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. అలాంటిది వందల ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవాలంటే ఇంకెంత ఖర్చు అవుతుందో అనే ఆలోచనకే మనకు కళ్ళు తిరుగుతాయి. కానీ మేము ఇప్పుడు చెప్పేది వింటే కళ్ళు తిరగవు మీరు తిరుగుతారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని నార్త్ వేల్స్ సమీపంలోని లాండుడునోలో 850 ఎకరాల్లో ఉన్న పార్స్ ఫామ్ హౌస్‌ను ఏడాదికి కేవలం ఒక పౌండ్‌కే(98 రూపాయలు) అద్దెకిస్తామంటోంది ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంధ సంస్ధ. ఆసక్తి ఉన్న వారి నుండి దరఖాస్తులను కూడా తీసుకుంటుంది.

గతంలో కూడా ఇలాంటి ఆఫర్లను మనం వినే ఉంటాం. అయితే ఈ ఆఫర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే 850 ఎకరాల ఫామ్ హౌస్‌తో పాటు 500 గొర్రెలను ఏడాదికి ఒక పౌండ్‌కు అద్దెకిచ్చేందుకు ఆ స్వచ్చంధ సంస్ధ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌లో సముద్రపు అంచున ఉన్న ఓ ప్రత్యేకమైన స్ధలం గ్రేట్ ఓర్మీ. ఈ గ్రేట్ ఓర్మీకి అత్యంత సమీపంలో ఉన్న పార్స్ ఫామ్‌ను అద్దెకు తీసుకుంటే అందులోని 4 బెడ్రూంల ఇల్లుతో పాటు 500 గొర్రెలను కూడా ఇస్తారు. ఈ మొత్తం కార్యక్రమానికి 'ఫార్మింగ్ హీరో' అనే ఉపశీర్షికను కూడా పెట్టింది. ఈ ఫామ్‌లో కొన్ని అంతరించిపోతున్న జీవ జాతులు ఉన్నాయి.

వాటిని కాపాడే ఉధ్దేశంతో ప్రకృతిని ప్రేమించే వారిని ఎంపిక చేసి ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకివ్వనున్నట్టు నేషనల్ ట్రస్ట్‌కు చెందిన గ్రీన్ ఉడ్ తెలిపారు. ఈ ఫామ్ హౌస్‌ను అద్దెకు తీసుకోవడానికి ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం మరీ త్వరగా దరఖాస్తు చేసుకోండి.

English summary

850 acres farm house for 100 rupees