మెగా అన్నయ్యకు 9 రోజుల బర్త్ డే సెలబ్రేషన్స్

9 days celebrations for Chiranjeevi birthday

06:38 PM ON 10th August, 2016 By Mirchi Vilas

9 days celebrations for Chiranjeevi birthday

ఆగస్టు 22 అంటే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే పండగ. ఎందుకంటే ఆరోజు చిరు పుట్టినరోజు. రాజకీయాల్లోకి వచ్చాక, కేంద్రమంత్రి కూడా కావడంతో ఈ మధ్య కాలంలో చిరు అభిమానులు ఈ పండగను పెద్దగా జరుపుకోలేకపోయారు. ఇక ఇప్పుడు వినూత్న రీతిలో ఏకంగా 9 రోజుల పాటు జరపాలని నిర్ణయించారు. 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం పురష్కరించుకుని ఈ నెల 14 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు యేడిద శ్రీనివాసరావు, రాజమండ్రి నగర చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజా బుధవారం ప్రకటించారు.

గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు నిర్వహించామని, ఈ ఏడాది తొమ్మిది రోజుల పాటు నిర్వహించడానికి చిరంజీవి యువత జాతీయ అధ్యక్షులు రవణం స్వామినాయుడు నిర్ణయించారని వివరించారు. సాధారణంగా గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇలా నవ రాత్రి వేడుకలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు చిరు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి బాగుండాలని, 150వ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని నవాహ్నిక దీక్షా మెగా ఉత్సవం పేరిట తెలుగు రాష్ట్రాల్లోని 9 దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో చిరు జన్మదిన వేడుకలు జరుగుతాయి. రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి.

1/11 Pages

14న కాణిపాకంలో...


కాణిపాకంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో పారాయణాలు, సూర్యునికి జప తర్పణ సహిత హోమం నిర్వహిస్తారు.

English summary

9 days celebrations for Chiranjeevi birthday