1లీ”కోక్ తయారీకి, 9లీ” నీళ్ల్లు? గ్రామాల్లో క్షీణిస్తున్న భూగర్భజలాలు, తప్పని నీటి కష్టాలు

9 Liters Of Water Using To Prepare One Liter Coke

11:24 AM ON 15th December, 2016 By Mirchi Vilas

9 Liters Of Water Using To Prepare One Liter Coke

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెతను నిజం చేస్తూ, కోకాలకోలా ఫ్యాక్టరీల వల్ల….ఊర్లకు ఊర్లే నీటి కొరతతో అలమటిస్తున్నాయట. అవును, ఓ గ్రామంలో కోకాకోలా కంపెనీ ఉంటే, .ఆ గ్రామంలోని గ్రౌండ్ వాటర్ లో సగానికి పైగా ఆ కంపెనీ తన బేవరేజెస్ కోసం వినియోగిస్తుందట! దీంతో…ఆ కంపెనీ ఉన్న గ్రామాలు తీవ్ర వాటర్ ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి వస్తుందట.! ఓ ప్రముఖ పర్యావరణవేత్త చెబుతున్న దానిప్రకారం ఒక లీటర్ కోక్ తయారీకి దాదాపు 9 లీటర్ల నీటిని ఖర్చు చేస్తారట. దీని కారణంగా సదరు గ్రామ గ్రౌండ్ వాటర్ లెవల్ తగ్గి తీవ్ర నీటి సమస్య ఏర్పడుతుంద ని చెబుతున్నారు. దీనికి కొన్ని సంఘటనలను ఉదాహరణలుగా చూపుతున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే,

1. రాజస్థాన్లోని కలదెరా అనే ప్రాంతంలో 1999లో కోకాకోలా తన ప్లాంట్ను ప్రారంభించింది. అయితే అప్పటికే ఆ గ్రామంలో నీటి వనరులు అరకొరగా ఉండేవి. ప్లాంట్ పెట్టాక అవి మరింత తగ్గిపోవడంతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం 5 ఏళ్లకు ఆ గ్రామంలో భూగర్భ జలవనరులు 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో స్థానికుల విన్నపం మేరకు ఆ ప్లాంట్ను ప్రభుత్వం మూసేయించింది.

2. ఇక కేరళలో మార్చి 2000వ సంవత్సరంలో ప్లచిమద అనే ప్రాంతంలో కోకాకోలా ఓ ప్లాంట్ను నెలకొల్పింది. అయితే ఆ ప్లాంట్ నుంచి వ్యర్థాలు పెద్ద ఎత్తున విడుదలై భూగర్భ జల వనరులు కలుషితమవడం, నీటి వనరులు గణనీయంగా తగ్గడంతో అక్కడి ప్రభుత్వం ప్లాంట్ను మూసివేసేలా చేసింది.

3. అలాగే ఉత్తరప్రదేశ్లోని మెహ్దీ గంజ్ అనే ప్రాంతంలో కూల్డ్రింక్ ప్లాంట్ను కోకాకోలా ఏర్పాటు చేయగా అక్కడ కూడా పైన చెప్పిన విధంగానే స్థానికులకు కష్టాలు ఎదురయ్యాయి. కోకాకోలా కంపెనీ పెద్ద ఎత్తున నీటిని వాడుకుంటుండడంతో అక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీరు, సాగునీరు లేక, అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆ ప్లాంట్ను ప్రభుత్వం 2013లో మూసివేయించింది.

4. అంతేకాదు, ఇంకా ఉత్తరాఖండ్, తమిళనాడు, వారణాసి వంటి ప్రాంతాల్లోనూ కోకాకోలా కంపెనీ అక్రమంగా నీటిని తోడుతుందనే సమాచారం రావడంతో అక్కడి ప్లాంట్లను ఈ మధ్య కాలంలో మూసివేయించారు.

ఈ లెక్కల ప్రకారం చూస్తే, కోకాకోలా రోజూ తమ తమ ప్లాంట్లలో ఎన్ని లీటర్ల కూల్ డ్రింక్లను తయారు చేస్తున్నారో, ఎంత నీరు అక్రమంగా భూగర్భం నుంచి తోడుతున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చ ని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. సహజ వనరులలో అత్యంత విలువైనది మంచినీరు…దీనిని ఈ విధంగా ఖర్చు చేయడానికి మనమూ ప్రత్యక్షంగా కారణమవుతున్నాం. కూల్ డ్రింక్స్ తాగితే వచ్చే రోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ, రేపటి తరానికి నీటిని అందించేందుకైనా కూల్ డ్రింక్స్ కు టాటా చెప్పేద్దాం.

ఇవి కూడా చదవండి: హనీమూన్ ట్రిప్ లో యువరాజ్ జంట ఖుషీ ఖుషీ

ఇవి కూడా చదవండి:ఛ ఛ... ఆలయంలోనే ఏఈవో రాసలీలలు

English summary

Coca Cola was very famous all around the world and it was one of the Top Cool Drink Brand in the World. Recently so many coca cola plants in India were closed because of they were using 9 liters of fresh water to prepare one liter coke. Due to this high amount of water usage the under ground water levels were drcreasing day by day.