ఒలింపిక్స్ కు 9 మిలియన్ కండోమ్స్ రెడీ

9 million condoms ready for olympics 2016

11:32 AM ON 9th July, 2016 By Mirchi Vilas

9 million condoms ready for olympics 2016

ఆటేమిటి, కండోమ్స్ ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా? అవును నిజం.. ఆటల పోటీల సందర్భంగా కండోమ్స్ సిద్ధం చేస్తున్నారట. ఒకటి కాదు రెండు కాదు.. వందలు కాదు వేలు కాదు.. ఏకంగా మిలియన్ల కొద్దీ కండోమ్ ప్యాకెట్లు రెడీ అయ్యాయి. అన్ని కండోమ్ ప్యాకెట్లను ఏం చేసుకుంటారని సందేహం రావచ్చు. కానీ ఇవన్నీ కేవలం వాడడానికే. నిజంగానే అన్ని కండోమ్ లను వాడుకోవడానికే తయారు చేస్తున్నారు. అన్ని కండోమ్ లను ఎప్పటికి వాడతారు అనుకోవచ్చు. అవన్నీ కేవలం ఒలంపిక్స్ గేమ్స్ టైంలోనే వాడుకుంటారనే ఓ నమ్మకం. అవును, ఏమాత్రం ఆశ్చర్యపోవద్దు.

ప్రతిష్టాత్మకంగా ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూసే ఒలంపిక్ గేమ్స్ రెండో వైపు కోణం ఇది. ఒలంపిక్స్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అందులో పాలుపంచుకోవాలని, దేశానికి మెడల్స్ తీసుకురావాలని ఆశిస్తుంటారు. కానీ అక్కడికి వచ్చే క్రీడాకారులు మాత్రం అసలు ఆటతో పాటు, బెడ్ మీద ఆ ఆట కూడా బాగా ఆడతారట. అందుకే వాళ్ల కోసం ఇలా కండోమ్ లను ముందుగా రెడీ చేస్తున్నారట. వచ్చే నెల 5 నుంచి ప్రారంభమవుతున్న ఒలింపిక్స్ సమరానికి బ్రెజిల్ నగరం అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దాదాపు 9 మిలియన్ల కండోమ్ లను ఇప్పటికే సిద్ధం చేసింది.

ఒలింపిక్స్ కు వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు, వీక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రత, సేఫ్టీ సెక్స్ లో భాగంగా వారికోసం ఈ ఫ్రీ కండోమ్స్ ను సిద్ధం చేసినట్లు అధికారులు కూడా ప్రకటించారు. వీటిన్నింటినీ నాటెక్స్ ల్యాబ్ అనే సంస్థ సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బర్ చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు ప్రకటించారు. అదండీ సంగతి.

English summary

9 million condoms ready for olympics 2016