మహేష్‌-మురుగ చిత్రానికి బాహుబలి బడ్జెట్‌

90 Crore Budget To Mahesh Next Movie With Murugados

10:38 AM ON 17th February, 2016 By Mirchi Vilas

90 Crore Budget To Mahesh Next Movie With Murugados

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు-స్టార్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ కలయికలో ఒక చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని మురుగదాస్‌ చెప్పారు. అయితే ఈ చిత్రానికి మొదట 110 కోట్లు బడ్జెట్‌ అని మురుగదాస్‌ చెప్పాడు. కానీ ఈ చిత్ర నిర్మాత ఎన్‌.వి. ప్రసాద్‌ అంత పెట్టలేనని మురుగదాస్‌ కి చెప్పడంతో ఇంక బడ్జెట్‌ ని 90 కోట్లకి ఫిక్స్‌ చేశాడు మురుగదాస్‌. ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమాన్ని తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్‌ 14న చెన్నైలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలుగులో 'బాహుబలి' చిత్రం తరువాత ఆ రేంజ్‌ బడ్జెట్‌ ని ఈ చిత్రానికే ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రానికి హారీష్‌ జైరాజ్‌ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం మహేష్‌ 'బ్రహ్మూెత్సవం' చిత్రం షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ అయిపోయిన వెంటనే మహేష్‌ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మురుగదాస్‌ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటాడు.

English summary