ఉగ్ర మద్ధతు సైట్ల బ్యాన్!!

94 websites were banned due to supporting ISI agents

05:43 PM ON 26th January, 2016 By Mirchi Vilas

94 websites were banned due to supporting ISI agents

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి కుట్రలు పన్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. దీని కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఉగ్రవాదుల చర్యలకు మద్దతు తెలుపుతున్న వెబ్‌సైట్లను నిషేదించారు. 94 వెబ్‌సైట్లను నిషేదించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ వెబ్‌సైట్లు ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రోత్సాహిస్తున్నాయి కాబట్టే ఈ వెబ్‌సైట్‌ ల పై నిషేదం విధించినట్లు మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ వివేక ఫన్సాల్కర్‌ ప్రకటించారు.

మీడియా వారు ఉగ్రవాద చర్యలను వ్యతిరేకించడంలో దృష్టి పెట్టారు కానీ ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడి చేస్తే మాత్రం ఆ వార్తలను ప్రచురించడంలో మాత్రం ఎంతగానో ఆసక్తి చూపిస్తారని ఆ వార్తలను పతాక శీర్షికలకు ఎక్కిసారని రైల్వేశాఖమంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా మారేలా ఎవరూ ప్రేరేపించకూడదని ఆయన కోరారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు అందరూ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

English summary

94 websites were banned due to supporting ISI agents for Republic Day cause.