9పదుల వయస్సు దాటినా .. అమెరికా చుట్టేశాడు

94 Year Old Andrews Coast To Coast Run

12:21 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

94 Year Old Andrews Coast To Coast Run

వయస్సు మీద పడితే ఎవరైనా ఇంటిపట్టునే ఉండి కృష్ణా రామా అనుకుంటారు. లేదంటే మనవలు, మనవరాళ్లతో కాల క్షేపంచేస్తారు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఈ మధ్యకాలంలో 90 ఏళ్లు నిండిన బామ్మలు, తాతయ్యలు కుర్రకారుకి దీటుగా సాహసాలు చేస్తున్నారు. తమకి ఇష్టమైన రంగంలో అద్భుతమైన ప్రతిభ చూపి ఔరా అనిపిస్తున్నారు. వయోభారం మాకు అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు. అలాంటి తొంభై ఏళ్ల తాత కథే ఇది.

అమెరికాకు చెందిన ఎర్నీ ఆండ్రూస్ విశ్రాంత నేవీ అధికారి. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆండ్రూస్ విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహించాడు.

93 ఏళ్లు నిండిన ఇతను తాజాగా తన 94వ జన్నదినాన్ని అత్యంత అరుదుగా జరుపుకున్నాడు. ఏంటి అంత అరుదు అంటారా? అవును ఇతను చేసిన సాహసం అరుదైనదే. అందుకే ఇప్పుడు ఆండ్రూస్ సెలబ్రిటీగా మారిపోయాడు. 94ఏళ్ల వయసులో ఆండ్రూస్ అమెరికా చుట్టుకొలతను చూసేశాడు. అంటే ఏ బైక్ మీదో, ఫ్లైట్ మీదో, కారు మీదో కాదండీ బాబూ.. ముసలి పాదాలతోనే దాదాపు రెండు సంవత్సరాలుగా పరిగెత్తి, ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

1/4 Pages

2013 అక్టోబర్ 7న అమెరికాలోని సాన్ డియాగోలో ఆండ్రూస్ పరుగు ప్రారంభమైంది. ఇది 2016 ఆగష్టు 21న అమెరికాలోని జార్జియా సముద్ర తీరంలో విజయవంతంగా పూర్తయ్యింది. అంటే దాదాపు రెండు సంవత్సరాల పది నెలలు. ఇంత సుదీర్ఘంగా పరిగెత్తిన ఆండ్రూస్ కి ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు తోడైంది. తన పరుగులో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆండ్రూస్ వెన్నంటే నిలిచారు.

English summary

Formal Navy Official of America who was participated in World War 2 named Andrews was started running on October 7th in the year 2013 and now he completed coast to coast running around America.