కిడ్నాప్ చేసి... కారులోనే అత్యాచారం..

9th Class Girl Kidnapped And Raped

06:30 PM ON 9th January, 2016 By Mirchi Vilas

9th Class Girl Kidnapped And Raped

అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్న కాలమిది. ఎన్ని అనుకున్నా జరిగేవి జరిగిపోతూనే వున్నాయి. ఒక్కొక్క ఘటన వింటుంటే, మరీ ఇంత బరితెగించి పోతున్నారా అనిపించడం సహజం. తాజాగా కోచింగ్‌ క్లాస్‌ నుంచి తిరిగి వస్తున్న 9వ తరగతి బాలికపై హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకున్న దారుణం మరింత కలవరానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే,

9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు ఆమెపై నడుస్తున్న కారులోనే అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.

గురువారం సాయంత్రం కోచింగ్ క్లాస్‌ నుంచి తిరిగొస్తుండగా బాలికను ఇద్దరు వ్యక్తులు కారులో అపహరించుకుపోయారు.ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, దాదాపు ఆరు గంటలపాటు తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించి మరీ బాలికను విడిచిపెట్టారు. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు ధైర్యం చేసి ఫిర్యాదు చేసారు. పోలీసులు స్వీకరించి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

English summary

A 9th class girl kidnapped and raped in car by two members in Haryana.Girl Parents Complained to Police and police booked the case and started investigation