షాకింగ్ న్యూస్: ఉపవాసం చేసి చనిపోయిన బాలిక!

A 13 years old girl dies for doing pasting for 68 days

10:37 AM ON 10th October, 2016 By Mirchi Vilas

A 13 years old girl dies for doing pasting for 68 days

ఒకటా రెండా ఏకంగా 68 రోజులపాటు ఉపవాసం చేసిన ఆ బాలిక మృత్యువడిలోకి చేరింది. హైదరాబాద్ సిటీలో 13 ఏళ్ల బాలిక చనిపోయింది. యువతి చనిపోక ముందు 68 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టింది. అది పూర్తయిన తర్వాత ఆసుపత్రిలో చేరింది.. రెండురోజుల కిందట గుండెపోటుతో మరణించింది. దీక్ష చేసి మరణిస్తే యువతిని బాల తపస్వీగా జైనులు కీర్తిస్తున్నారట. నగరంలోని ఓ జైన్ ఫ్యామిలీ గోల్డ్ బిజినెస్ చేస్తోంది. వాళ్లకు 13 ఏళ్ల ఆరాధన అనే అమ్మాయి ఎనిమిదో తరగతి చదివేది. యువతిని స్కూల్ కి పంపకుండా పేరెంట్స్ ఉపవాస దీక్షలకు అనుమతి ఇచ్చారు. దీక్షకు దిగేవారు ఎవరైనా అది పూర్తి అయ్యేవరకు అన్నపానీయాలు వంటివి ముట్టరు.

కానీ మైనర్ బాలికను ఉపవాసం పేరుతో కూర్చోబెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు సామాజిక కార్యకర్త. గతంలో ఈ యువతి 40 రోజులపై గానే దీక్ష చేసింది. ఇప్పుడు ఆరాధన దీక్షకు దిగిన సంగతి అందరికీ తెలుసని, ఎవరు అభ్యంతరం చెప్పలేదని, ఆమె చనిపోయాక తమను తప్పుపడుతున్నారంటూ గ్రాండ్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి దీక్షలు చేయాలని ఎవరూ ఒత్తిడి చేయరని, ఈ ఘటన తమకు గుణపాఠమని జైన పెద్దలు చెబుతున్నమాట. మరోవైపు మైనర్లు దీక్షలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని చట్టరీత్యా నేరమని బాలల హక్కుల సంఘాలు అంటున్నాయి. ఆరాధన మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

1/3 Pages

గురువు ఆదేశంతోనే అంటున్న తండ్రి...(వీడియో)


గురువు ఆదేశాలతోనే తమ కుమార్తె 68 రోజులు ఉపవాసం చేసిందని, ఆమెను తాము బలవంత పెట్టలేదని 13 ఏళ్ల ఆరాధన తండ్రి లక్ష్మీచంద్ చెబుతున్నాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చినందున వాటి నివారణకు తాము ఉపవాసం చేయించలేదని, తన ఇష్టంతోనే ఆమె ఇలా చేసిందని ఆయన అన్నాడు. ఇది తపస్సులో భాగమే అన్నాడు. టీవీ9 స్టూడియోలో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న ఆయన పలు విషయాలు వివరించాడు. ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి ఏమన్నాడో తెలుస్తుంది.

English summary

A 13 years old girl dies for doing pasting for 68 days