బైక్ తో స్టంట్ చేసి గర్ల్ ఫ్రెండ్ ని చంపేసిన 17 ఏళ్ళ కుర్రాడు.. తరువాత..

A 17 years boy killed his girlfriend with bike stunt

05:53 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

A 17 years boy killed his girlfriend with bike stunt

ఆ కుర్రాడు వయసు 17 ఏళ్ళు... చేతిలో బైక్... తోడుగా అందమైన అమ్మాయి... రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం... ఇంకేముంది ఆ కుర్రాడు రెచ్చిపోయాడు. ఉరకలేసే ఉత్సాహంతో బైక్ తో విన్యాసాలు చేశాడు. ఒక వీల్ ను పైకెత్తి, క్రింద పడేసి, అటు తిప్పి, ఇటు తిప్పి స్టంట్స్ చేశాడు. ఆ స్టంట్స్ శృతిమించి, గతి తప్పి బైక్ అకస్మాత్తుగా అదుపు తప్పింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయి రోడ్డుపై పడగానే ఆ వెనుకనే వస్తు న్న ఓ వాహనం ఆమెపైనుంచి దూసుకుపోయింది. ఆ కుర్రాడికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వెంటనే లేచి దులిపేసుకొని బైక్ తీసుకుని పారిపోయాడు.

వెనుకనున్న అమ్మాయికి ఎలా ఉందో? అనే ఆలోచన కూడా లేకుండా చీకట్లో మాయమైపోయాడు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పాత మద్రాసు రోడ్డులో ఓ మాల్ ఎదురుగా జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అక్కడ ఉన్నవాళ్ళు ఆ అమ్మాయిని షైనీ కిరణ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బైక్పై విన్యాసాలు చేసిన ఆ కుర్రాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బిన్నీ భార్యను సూసైడ్ చేసుకోమన్నారు!

ఇది కూడా చదవండి: ఐసీయూలో శిరీష్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పవన్!

ఇది కూడా చదవండి: అడ్డంగా దొరికేసిన 'లోఫర్' హీరోయిన్

English summary

A 17 years boy killed his girlfriend with bike stunt in Bangalore.