యువతిపై పగ తీర్చుకునేందుకు స్పైడర్ మ్యాన్ గా మారిన యువకుడు(వీడియో)

A 20 years boy want to take revenge on woman

03:58 PM ON 29th September, 2016 By Mirchi Vilas

A 20 years boy want to take revenge on woman

తల్లిని అవమానించారన్న కోపంతో ఓ యువకుడు కత్తి తీసుకుని దొడ్డిదారిలో ప్లానటేరియా కాంప్లెక్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్తుకు చేరుకున్నాడు. స్పైడర్ మ్యాన్ లా మారి కలకలం సృష్టించిన ఘటన ముంబైలోని భయందర్(పశ్చిమ) ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే ధోనీ గోపాల్(20) అనే యువకుడు రిజ్వీ కాలేజీ విద్యార్థి. భయాందర్ పశ్చిమ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో గోపాల్ తల్లికి, ఎదురింటి మహిళకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సదరు మహిళ గోపాల్ తల్లిని లాగి పెట్టి కొట్టింది. దీంతో గోపాల్ కసితో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని మహిళ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడు.

అపార్ట్మెంట్ లోని సదరు మహిళ ఇంటి డోర్ కొట్టాడు. ఎంతసేపటికి ఆ మహిళ తలుపు తీయలేదు. తీవ్ర ఆవేశంలో ఉన్న ఆ యువకుడు వెళ్లిపోకుండా ప్యారాపెట్ వైపు నుంచి ఎక్కుతూ మూడో అంతస్తులో ఉన్న ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లేందుకు వీలుకాకపోవడంతో అదే కత్తితో కిటికీని ధ్వంసం చేసి.. కిందికి వచ్చాడు. ఈ ఘటనను గమనించిన అపార్ట్మెంట్ వాసులు గోపాల్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఒకసారి ఆ వీడియోపై మీరు ఓ లుక్ వెయ్యండి..

English summary

A 20 years boy want to take revenge on woman