500 కోట్లు కొట్టేసి లవర్ కి ఏం కొన్నాడో తెలిస్తే షాకౌతారు!

A 23 years boy stolen 500 crores and bought costly car to his lover

01:04 PM ON 15th October, 2016 By Mirchi Vilas

A 23 years boy stolen 500 crores and bought costly car to his lover

ఆ అబ్బాయి వయసు 23 సంవత్సరాలు మాత్రమే. కానీ 500 కోట్లు కొల్లగొట్టాడు. ఎలానో తెలిస్తే షాకవ్వడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఎనిమిదంతస్తుల భారీ బిల్డింగ్ లో కాల్ సెంటర్ పెట్టి అమెరికా సర్కారుకి పన్ను ఎగ్గొడుతోన్న అమెరికా పౌరుల్ని టార్గెట్ చేస్తూ కోట్లు కొల్లగొట్టాడు సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ, అమెరికా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న వారి వివరాలు తెలుసుకుని, వారికి ఫోన్లు చేసి బెధిరిస్తూ, దాదాపు రూ. 500 కోట్లకు పైగా నొక్కేసిన 23 ఏళ్ల ఈ థానే కుర్రాడి గురించి కూపీ లాగుతుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.

తాను కొల్లగొట్టిన డబ్బుతో ఎన్నో విలువైన కార్లను షాగీ కొన్నాడని, అంతేకాదు, అహ్మదాబాద్ లో ఆడిఆర్ 8 కారును కొన్న తొలి వ్యక్తి కూడా షాగీయేనని పోలీసు విచారణలో తేలింది. ఈ కారును తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే గిఫ్ట్ గా షాగీ ఆమెకు రూ. 2.5 కోట్ల విలువైన ఈ కారును గిఫ్టిచ్చాడని తెలిపారు. ఆపై తన స్నేహితులతో ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నాడని పోలీసులు వివరించారు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని కారును స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. షాగీ ఇలా సంపాదించిన అక్రమార్జనతో ఇప్పుడిప్పుడే దుబాయ్ లో వ్యాపారాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది.

English summary

A 23 years boy stolen 500 crores and bought costly car to his lover