బాలుడిని రేప్ చేసిన మహిళ.. అది వీడియో తీసి.. ఆపై..

A 23 years girl raped 16 years boy in Uttar Pradesh

11:27 AM ON 31st August, 2016 By Mirchi Vilas

A 23 years girl raped 16 years boy in Uttar Pradesh

రోజులు మారాయి అంటే ఇదేనా.. ఓ పక్క మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతుంటే, మరోపక్క బాలురపై కూడా మహిళలు లైంగిక దాడులకు దిగుతున్న ఘటనలు కూడా అక్కడక్కడా పెరిగుతున్నాయి. తాజాగా 16 ఏళ్ల మైనర్ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల ఓ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేయడమే కాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని మైనర్ బాలుడిపై ఒత్తిడి తీసుకువచ్చినందుకు సహరాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం(పోస్కో) సెక్షన్ 7,8 లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద నింధితురాలైన మహిళపై ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు పెట్టారు.

మైనర్ బాలుడిపై మహిళ అత్యాచారం జరిపిన సంఘటనను వీడియో తీసి, దాన్ని బయటపెడతానని బెధిరించి బాలుడిని పలుసార్లు లైంగికంగా వేధించిందట. తనను పెళ్లి చేసుకోకుంటే బాలుడితో గడిపిన వీడియో క్లిప్పింగును ఆన్ లైన్లో పెడతానని మహిళ మైనర్ బాలుడిని బెధిరించిందని పోలీసులు చెబుతున్నారు. ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, నింధితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్ పూర్ స్టేషన్ ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు. మొత్తంమీద ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా మైనర్ బాలుడితో మహిళకు ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి చేసుకోవాలని బాలుడిపై మహిళ ఒత్తిడి తీసుకువస్తే అతను తిరష్కరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో రావడంతో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రేమతో ప్రియుడ్ని కసిగా మెడపై కొరికింది.. దాంతో..

ఇది కూడా చదవండి: వినాయక చవితి ఉత్సవాల్లో మీరు చేస్తున్న క్షమించరాని తప్పులు

ఇది కూడా చదవండి: ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

English summary

A 23 years girl raped 16 years boy in Uttar Pradesh. In Uttar Pradesh a 23 years girl raped 16 years minor boy and taken video.