ఆమెకు 25 ఏళ్ళు... కానీ 100 ఆపరేషన్లు

A 25 years girl had 100 operations till now

06:38 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A 25 years girl had 100 operations till now

ఈ ప్రపంచంలో ఎన్నో అరుదైన ఘటనలు చూస్తుంటాం. ఇక రోగాలు కూడా కొన్ని అంతుబట్టవు. అలాగే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన యువతికి వైద్యులు ఇప్పటి వరకు వందసార్లు ఆపరేషన్ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. 25ఏళ్ల ఫౌజియా యూసఫ్ అనే యువతి చిన్నప్పటి నుంచే ఫైబ్రోమేటోసెస్ అనే అంతుచిక్కని చర్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఇంట్లో కంటే లాహోర్ లోని షాయిక్ జాగేద్ అనే ఆస్పత్రిలోనే ఎక్కువగా గడిపే పరిస్థితి ఏర్పడింది. వ్యాధిని నయం చేయడానికి వైద్యులు ఎంతగానో శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు. చివరకు వ్యాధికి కారణమైన ఎడమ మోచేతిని తొలగించాలని నిర్ణయించారు. దీనికి ఫౌజియా ఒప్పుకోలేదు.

మీరు ఎన్ని శస్త్రచికిత్సలైనా చేయండి, కానీ చేయిని తొలగించడానికి మాత్రం నేను ఒప్పుకోను అని తెగేసి చెప్పేసింది. కుంటితనంతో బతకడం కంటే చనిపోవడమే మేలంటోంది ఈ యువతి. ఆమెకు 8 ఏళ్ల వయస్సులోనే మొదటి శస్త్రచికిత్స చేశారట. అప్పటి నుంచి ఇప్పటిదాకా తరచూ శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారీ తొడ భాగం నుంచి చర్మాన్ని తీసి అతికిస్తున్నారట. దీంతో ఆ వ్యాధి ఆమె కాళ్లకు కూడా వ్యాపించింది. మనస్సులో ఎంత మథనపడుతున్నా ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లతోపాటు ఆస్పత్రి సిబ్బందికి కూడా ఆమె మంచి స్నేహితురాలైపోయింది. ఈ విషయం ఆమె చేతికి 55 సార్లు చికిత్స చేసిన డా. షాఫిక్ అహ్మద్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చదవండి:4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

English summary

A 25 years girl had 100 operations till now