ఈ 27ఏళ్ళ మహిళ చేసిందేమిటో తెల్సి ప్రపంచమే ఆశ్చర్యపోయింది!

A 27 years woman going to 196 countries and creating record

11:03 AM ON 15th November, 2016 By Mirchi Vilas

A 27 years woman going to 196 countries and creating record

రికార్డు సృష్టించాలంటే ఏదో ఒక మార్గం ఎంచుకుని, తదేక దృష్టితో పనిచేస్తూ లక్ష్యం పూర్తిచేస్తే, రికార్డు క్రియేట్ అవుతుంది. అయితే అమెరికాలోని కనెక్టికట్ కు చెందిన 27 ఏళ్ల కాసాండ్రా డి పెకోల్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని ప్రతీ దేశం చుట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కనుంది. జులై 2015లో 196 దేశాలు చుట్టేందుకు ప్రారంభమైన ఆమె యాత్ర ఇప్పటికి 181 దేశాల్లో పూర్తయింది. రికార్డుకు మరో 15 దేశాల దూరంలో నిలిచింది. అవి కూడా పూర్తయితే ప్రపంచ దేశాలను అత్యంత వేగంగా పర్యటించిన మహిళగా రికార్డు సొంతమవుతుంది. అంతేకాదు అత్యంత పిన్నవయసులో ఈ ఘనత సాధించిన మహిళగానూ గిన్నిస్ రికార్డులకెక్కనుంది.

ఎక్స్ పెడిషన్196 పేరుతో కాసాండ్రా ప్రపంచ పర్యటన ప్రారంభమైంది. శాంతికి అంబాసిడర్ గా ప్రారంభమైన ఆమె యాత్రకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు కాసాండ్రా పర్యటనకు 2 లక్షల డాలర్లు(దాదాపు 1.35కోట్లు) ఖర్చయింది. ఈ మొత్తం ఖర్చును స్పాన్సర్సే భరించారు. మరో 40 రోజుల్లో మిగతా 15 దేశాలను చుట్టేందుకు కాసాండ్రా సిద్ధమవుతోంది. మనమూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దామా...

English summary

A 27 years woman going to 196 countries and creating record