బాలికను రేప్ చేసిన కామాంధుడికి జీవిత ఖైదు

A 38 years man raped teenage girl

06:10 PM ON 28th June, 2016 By Mirchi Vilas

A 38 years man raped teenage girl

ఏడు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. పుత్తూరు మండలం రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన గజేంద్రకు ఏడేళ్ల కూతురు ఉంది. ఇతను పాకాల మండలం దామలచెరువు సమీపాన ఉన్న ఓ రైతు మామిడి తోటకు కాపలాగా ఉండేవాడు. 11 జూలై 2015న ఇతను కుమార్తెను అవ్వ వద్ద వదిలి పనికి వెళ్లాడు. ఐరాల మండలం గుండ్లపల్లె గ్రామానికి చెందిన బుజ్జి(38) ఆ బాలికను దామలచెరువు సంతగేటు వద్దకు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పాకాల పోలీసులు కేసు నమోదు చేసి బుజ్జిని కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన 8వ కోర్టు జడ్జి చిదానందం బుజ్జిపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల ఫైన్ కూడా విధిస్తూ తీర్పు చెప్పారు.

English summary

A 38 years man raped teenage girl