తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

A 5 years baby gave a clue about killer

12:18 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A 5 years baby gave a clue about killer

ఎంత తెలివైన క్రిమినల్ అయినా సరే, ఏదో క్లూ వదిలేస్తాడని, అది పట్టుకుంటే ఈజీగా పట్టుకోవచ్చని చాలామంది పోలీసులు తమ అనుభవం రంగరించి చెపుతూ వుంటారు. సరిగ్గా ఈకేసులోనూ అదే జరిగింది. బెంగళూరు నగరంలోని మిల్క్ మ్యాన్ వీధిలో ఉంటున్న 29 ఏళ్ల సుప్రీత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెది హత్యేనని, భర్త రవిరాజ్ షెట్టి(32) ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్యను అతడే హత్య చేసినట్టు వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. తన భార్య రెండేళ్ల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఇంటరాగేషన్ లో భర్త చెప్పాడు.

1/4 Pages

అంతేకాదు సుప్రీత ఆత్మహత్య చేసుకున్న సమయంలో తాను ఇంట్లో లేనని, ఐదేళ్ల కుమార్తె రీతు మాత్రం ఇంట్లో నిద్రిస్తోందని చెప్పాడు. దీంతో రీతుతో మాట్లాడాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తల్లి హత్య తర్వాత రీతు తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. తల్లి ఆస్పత్రిలో ఉందని తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఉంది. రీతుతో మాట్లాడి అసలు విషయం రాబట్టాలని నిర్ణయించిన పోలీసులు ఇందుకోసం ఓ మహిళా ఎస్సైని నియమించారు. ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఆమె ఉల్సూరులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రీతును కలుసుకునేందుకు వెళ్లారు. అయితే పోలీస్ డ్రెస్ లో కాకుండా మామూలు దుస్తులు ధరించి వెళ్లారు.

English summary

A 5 years baby gave a clue about killer. A husband killed his wife without small clue. But his 5 years daughter gave a clue to the police to arrest her father.