60లో ఏకంగా 23 సార్లు గుండెపోటు!?

A 60 years old man get 23 times heart attack

11:18 AM ON 30th January, 2016 By Mirchi Vilas

A 60 years old man get 23 times heart attack

ఒకటీ, రెండూ మూడూ కాదు ఏకంగా 23 సార్లు గుండెపోటు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. పైగా 60 ఏళ్ళ వయస్సులో..... అందునా కేవలం నాలుగు గంటల వ్యవధిలో..... మొత్తానికి గట్టి పిండమే... బహుశా రాతి గుండె అంటారు కదా... దానికన్నా గట్టిదేమో.... ఒకసారి వివరాలలోకి వెళితే.. కేరళలోని కొచ్చిన్ లో 60 ఏళ్ల వయసున్న ఓ పెద్దమనిషి తన మనవడితో ఆడుకుంటున్నాడట. సరిగా ఆ సమయంలోనే గుండెపోటు వచ్చింది. దీంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ తీసి, గుండెపోటు వచ్చినట్టు నిర్ధారణ చేసారు. ఆ తరువాత అతనికి చికిత్స చేసేందుకు వారు ప్రయత్నించగా అందుకు ఆయన శరీరం సహకరించలేదు సరికదా.. పదేపదే గుండె ఆగిపోవడం మొదలు పెట్టిందట.

దీంతో ఆయనను 'ఆస్టర్ మెడిసిటీ' ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు రాగానే తొలి గంటలో అందాల్సిన వైద్యం అందలేదని వెల్లడించారు. అందువల్లే 23 సార్లు ఆయన గుండె ఆగిందని చెప్పారట. అయితే అప్పుడు స్టెంట్ వేయడంతో ఆయన క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. అయితే అది కేవలం 30 శాతం రక్తాన్ని మాత్రమే పంపింగ్ చేస్తోందని వైద్యులు చెప్పారు. ఇప్పటివరకూ తట్టుకుని నిలబడ్డ ఆ గుండె ఇంకా ఎంతకాలం కొట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి అరుదైన గుండె కధ ఇది.

English summary

A 60 years old man get 23 times heart attack but still he is alive.