కూతుర్ని లేపుకెళ్లిపోయాడని అతని తల్లిని బట్టలూడదీసి కొట్టారు

A 60 years old woman beaten by 4 women

12:24 PM ON 26th April, 2016 By Mirchi Vilas

A 60 years old woman beaten by 4 women

కన్న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తల్లిని బజారుపాలు చేసింది. తన కుమారుడు ఓ యువతితో వెళ్లిపోయాడనే కారణంతో ఆ యువకుడి తల్లికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నరకం చూపించారు. ఆమె వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అందరిముందు బట్టలూడదీసి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. లఖింపూర్ ఖేరీలో ప్రేమించుకున్న ఇద్దరు యువతీ యువకులు ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు. దీంతో బాలిక తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటి పై దాడికి దిగారు.

60 ఏళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతో పాటు బట్టలూడదీశారు. అనంతరం ముఖం పై, చెప్పరాని చోట్ల కారం పోసి పొర్లించి కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిందిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయలేదు. అదే సమయానికి పోలీసులు వచ్చి దుశ్చర్యను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేయగా నింధితులు పరారీలో ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలే.

English summary

A 60 years old woman beaten by 4 women