ఆ సినిమా చూస్తుంటే ఆగిపోయిన గుండె!

A 65 years oldman died while watching The Conjuring 2 movie

10:49 AM ON 18th June, 2016 By Mirchi Vilas

A 65 years oldman died while watching The Conjuring 2 movie

అవును నిజం... ఎందుకంటే సినిమాలంటే జనాలకు చాలా ఇష్టం. పైగా హారర్ సినిమాలంటే కొంతమందికి ప్రాణం. దీనికి ఏజ్ గ్యాప్ లు కూడా ఉండవు. రిలీజ్ అవడం పాపం థియేటర్లలో దూరేస్తారు. అయితే ఇలాగే సినిమా హాల్లోకి దూరి, హారర్ సినిమా చూస్తూ, ఓ పెద్దాయన ప్రాణం పోగొట్టుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ది కంజూరింగ్- 2 చిత్రం చూస్తూ గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగిన ఈ సంఘటన పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. పోలీసుల కధనం ప్రకారం తమిళనాడులో నివసిస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు 'కంజూరింగ్ 2' సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లారు.

సినిమా క్లైమాక్స్ సమీపిస్తుండగా ఇందులో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఇతని వయసు 65 ఏళ్లు కావడంతో.. హారర్ మూవీ బాగా ప్రభావం చూపించింది. సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. హారర్ సినిమాల విషయంలో హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన నిరూపిస్తోంది. అయినా ఆ యావ ఉన్నవాళ్లు ఆగరు కదా.

English summary

A 65 years oldman died while watching The Conjuring 2 movie