69ఏళ్ళ వయసులో బడికి..

A 69 years old man joined in 10th class

12:41 PM ON 26th September, 2016 By Mirchi Vilas

A 69 years old man joined in 10th class

లైఫ్ ని మనం ఎలా కావలిస్తే అలా మలచుకోవచ్చని లేటు వయస్సులో కూడా ఇతను నిరూపిస్తున్నాడు. అతని పేరు దుర్గా కామి. వయసు 69 సంవత్సరాలు. నేపాల్ వాసి. టీచర్ కావాలనేది జీవితాశయం. అకస్మాత్తుగా ఈయన వార్తల్లోకి ఎక్కడానికి కారణమేమంటే, సడన్ గా, ఈ ఏడాది పదో తరగతిలో చేరాడు. తాను గతంలో సాధించలేనిది ఇప్పుడు సాధించాలని ఆరాటం. అందుకే ఎవరేమనుకున్నా లెక్కచేయకుండా పదిలో చేరాడు. క్లాసు రూములో తొలుత తోటి విద్యార్థులు అతడిని వింతగా చూసేవారు. తర్వాత అతనితో కలిసిపోయారు. కామి రోజూ మూడు గంటలు నడిచి స్కూలుకు చేరుకుంటుండడం గమనార్హం.

తాతలాంటి సహ విద్యార్థితో తొలుత అంటీముట్టనట్టు ఉన్న విద్యార్థులు ఇప్పుడు అతడితో మమేకమై, ముచ్చట్లాడుతున్నారు. సందేహాలను తీర్చుతున్నారు. తన తండ్రి వయసున్న వ్యక్తికి పాఠాలు చెప్పడం చాలా బాగుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తోటి విద్యార్థులు అతడిని బా(తండ్రి)గా సంబోధిస్తున్నారు. భార్య చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు స్కూల్లో చేరినట్టు కామి తెలిపారు. రాత్రిళ్లు టార్చిలైట్ల వెలుగులో చదువుకునే కామి రాత్రిళ్లు భోజనం చేయరు. తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించకపోవడమే ఇందుకు కారణం. ఇక స్కూల్ లో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ కామి పాలుపంచుకుంటారు. గేమ్స్ లో చురుగ్గా పాల్గొంటారు. ప్రాణం పోయేంత వరకు చదువుకోవాలనేదే తన ఆశయమని కామి అనడం విశేషం.

ఇది కూడా చదవండి: అక్టోబర్ లో పండగలే పండగలు.. 15రోజులు సెలవలు!

ఇది కూడా చదవండి: మీరు కొన్న ఆ ఫోన్లను తిరిగిచ్చేయండి.. లేదంటే మీ పనంతే: పోలీసులు వార్నింగ్!

ఇది కూడా చదవండి: రకుల్ మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

English summary

A 69 years old man joined in 10th class. A 69 years old man going to school and studying 10th class. Because his wife was expired and he is alone.