'అ..ఆ..' సరైనోడును క్రాస్ చేసేసిందా?

A Aa crossed Sarainodu movie collections

10:52 AM ON 6th June, 2016 By Mirchi Vilas

A Aa crossed Sarainodu movie collections

ఏ నిమిషానికి ఏమి జరుగునో... అని సినీ కవి రాసిన పాటకు సరిగ్గా అతుక్కుపోతాయి సినీ పరిశ్రమలోని కొన్ని ఘటనలు... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జోడీగా వచ్చిన ‘అ..ఆ..’ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే కదా... అయితే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్ మార్క్‌కు చేరుకుందట. అక్కడి బ్లూ స్కై డిస్ట్రిబ్యూటర్ సంస్థ కథనం ప్రకారం.. నార్త్ అమెరికాలోని సుమారు 130 స్క్రీన్స్‌లో ‘అ..ఆ’ చిత్రం హౌస్‌ఫుల్‌గా ఆడుతోందట. రిలీజైన మొదటి రోజే 266,729 డాలర్లను వసూలు చేసిందని అంటున్నారు. అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు’ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసిందని కూడా లేక్కెస్తున్నారు. లీడింగ్ ఇండియన్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్‌లో ఈ చిత్రం బిజినెస్ డీటైల్స్‌ను రివీల్ చేశాడు. మరి ఇంకా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో అ..ఆ..

English summary

A Aa crossed Sarainodu movie collections