'అ.. ఆ..' టీజర్.. పరిచయమవ్వడానికే పాతికేళ్ళు పట్టింది

A Aa first look teaser

05:42 PM ON 13th April, 2016 By Mirchi Vilas

A Aa first look teaser

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం 'అ.. ఆ..', లవర్ బాయ్ నితిన్, హాట్ బ్యూటీ సమంత మొదటిసారి కలిసి నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చెప్పినట్లు గానే కాసేపటి క్రితమే(5 గంటలకు) విడుదల చేశారు. ఊహించినట్లే మాంచి లవ్ ఎలిమెంట్లతో ఈ టీజర్ సర్ప్రైస్ చేసింది. ''అనసూయ రామలింగం.. అ.. ఆనంద్ విహారి.. ఆ..'' అంటూ క్యారెక్టర్లను మనకు పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఇంతలో సమంత డైలాగ్.. ''పక్కపక్కనే ఉండే అక్షరాలు.. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది'' అంటూ కథలో ఉన్న మ్యాజిక్ ని మనకి పరిచయం చేసింది.

త్రివిక్రమ్ డైరక్షన్ లో రూపొందుతున్న ''అ..ఆ'' సినిమా విజయం సాధించడం.. నితిన్ కు ఎంతో కీలకం. ఎందుకంటే ఇష్క్, గుండె ఝారి గల్లంతయ్యిందే, హార్ట్ అటాక్ వంటి చిత్రాలు విజయాలు తరువాత నితిన్ వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అయిపోయిందంటే నితిన్ ని ఇంకా ఎవరూ పట్టించుకోరు.


English summary

A Aa first look teaser. A Trivikram Srinivas celluloid A Aa movie first look teaser.