అ..ఆ..ని వెంటాడుతున్న బ్రహ్మోత్సవం

A Aa Movie Will Be Postponed Because Of Brahmotsavam

10:07 AM ON 11th May, 2016 By Mirchi Vilas

A Aa Movie Will Be Postponed Because Of Brahmotsavam

అదేమిటి స్వయంగా మహేష్ బాబు డేట్ ఎనౌన్స్ చేసినా, ఇంకా బ్రహ్మోత్సవానికి ముహూర్తం కుదరలేదా? అనుకున్న డేట్ కు రిలీజ్ చేయకపోవడానికి కారణాలేమైనా ఉన్నాయా? అని ఫిల్మ్‌నగర్‌లో డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయట. అసలు విషయానికొస్తే... బ్రహ్మోత్సవం మూవీ 20న రిలీజ్ అవుతుందని ఆడియో ఫంక్షన్‌లో స్వయంగా మహేష్‌బాబే అనౌన్స్ చేసినా అదే డేట్‌కు రిలీజ్ కష్టమేనంటున్నారు. ఎందుకంటే మే 27న కూడా బ్రహ్మోత్సవం టీమ్ సబ్‌స్టిట్యూట్‌గా ఉంచుకుందట . టాకీపార్ట్ కంప్లీట్ అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డీటీయస్ మిక్సింగ్ లాంటి పనులు కంప్లీట్ చేసుకుని మే 20కి రిలీజ్ చేయాలని గట్టి ప్లాన్‌లో యూనిట్ ఉందట. అయితే ‘బ్రహ్మోత్సవం’కు ‘అ..ఆ’ రిలీజ్‌కూ లింకు ఉందట. బ్రహ్మోత్సవం రిలీజ్ 20న అయితే.. అ..ఆ జూన్ 3న విడుదల చేయాలని, అదే 27న అయితే ‘అ..ఆ’ మూవీ జూన్ 9 ఆడియన్స్ ముందుకు వచ్చే చాన్స్ఉందని ఇన్‌సైడ్ టాక్. జూన్‌లో స్కూళ్లు తెరవడం,పేరెంట్స్ అడ్మిషన్ పనుల్లో హడావుడి‌గా ఉంటారు. అందుకే ఈ రెండు ఫ్యామిలీ మూవీలకు మంచిది కాదనీ, అనుకున్న ప్రకారం మే 20న బ్రహ్మోత్సవం, జూన్ 3న అ..ఆ రిలీజ్ చేస్తేనే ఇద్దరికీ వర్కవుట్ అవుతుందని కొంతమంది తెరపండిన పెద్దలు చెబుతున్నారట. మరి బ్రహ్మోత్సవానికి ఏ మహూర్తం కన్ ఫాం చేస్తారో చూడాలి! మొత్తానికి డేట్ లు కుదరక పెద్ద , చిన్న సినిమాలకు ఎక్కడ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చెప్పడం కష్టమే.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:ప్రాణం తీసిన ఫుడ్‌ ఎలర్జీ...

English summary

Super Star Mahesh Babu Brahmotsavam and Trivikram's A..Aa.. movies to be released in 10 days of time and recently Mahesh Babu Announced Brahmotsavam movie will released on 20th may. If Brahmotsavam movie postpones A..A.. movie will also postpones.