జూన్ 2నే అ..ఆ..

A Aa Release Date Confirmed

10:18 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

A Aa Release Date Confirmed

నితిన్‌, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ: అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి’ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కథానాయకుడు నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ చిత్రంలో అనసూయ రామలింగం పాత్రలో సమంత, ఆనంద్‌ విహారి పాత్రలో నితిన్‌ నటించారు. అనుపమ పరమేశ్వరన్‌, నరేష్‌, నదియా, అనన్య, శ్రీనివాస్‌ అవసరాల, బ్రహ్మానందం, అలి, పోసాని, రావు రమేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను నితిన్ అభిమానులతో పంచుకున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించాడు.

ఇవి కూడా చదవండి:ఈసారి మహేష్ ని ఏకిపారేశాడు

ఇవి కూడా చదవండి:670 కోట్లు ఇస్తామన్నారు.. అయినా ఆ సినిమా చేయనన్నాడు

English summary

Trivikram Srinivas film A..Aa..movie release date was confirmed by movie unit and that movie was going to be released on June 2. Nithin,Samantha,Anupama Parameswaran were acted in lead roles in the movie